అనుకున్నట్టుగానే మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట మార్చారు. కాంగ్రెస్‌తో తెలుగుదేశం పార్టీ ఎన్నటికీ పొత్తు పెట్టుకోదని, ఒకవేళ అలా పొత్తు పెట్టుకుంటే ఇంతకంటే దుర్మార్గం మరొకటి ఉండదని, అలా చేస్తే ప్రజలు బట్టలూడదీసి తంతారని గతంలో వ్యాఖ్యలు చేసిన మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, తాజాగా ఒక విగ్రహ ఆవిష్కరణ సభలో మాట్లాడుతూ చంద్రబాబు నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. తనకు ఇష్టం లేకపోయినా అధిష్టానం నిర్ణయానికి తలవంచు తున్నానని చెబుతూనే, దేశాన్ని కబళించడానికి ప్రయత్నిస్తున్న మోడీని అడ్డుకోవడానికి చంద్రబాబు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు అంటూ తెలుగుదేశం పార్టీ నిర్ణయాన్ని సమర్థించారు.
గతంలో చేసి వ్యాఖ్యలు:
” దేశాన్ని దోచుకుని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్‌తో టీడీపీ చేతులు కలిపితే ప్రజలు బట్టలూడదీసి తంతాారు. ఎన్టీఆర్ కాంగ్రె్‌సను వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఇప్పుడు రాజకీయ స్వార్థం కోసం ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకుంటే అంతకంటే దుర్మార్గం ఉండదు, రాష్ట్ర ప్రజలు క్షమించరు, మా అధినేత చంద్రబాబు అటువంటి తప్పు చేస్తారని నేను భావించడం లేదు. ” – ఇవీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు గతంలో చేసి వ్యాఖ్యలు.
తాజా వ్యాఖ్యలు :
” దివంగత ఎన్టీఆర్ కేవలం కాంగ్రెస్‌పై ఉన్న కోపంతో, ప్రజలకు అన్యాయం చేస్తుందని 36 ఏళ్ల కిందట తెలుగువారి ఆత్మగౌరవం కాపాడేందుకు తెలుగుదేశం పార్టీ ని స్థాపించారు. దానికి అనుగుణంగా నే ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా మేమంతా కాంగ్రెస్‌పై పోరాటం చేశాము. ప్రస్తుతం ఈ దేశాన్ని మోదీ కబలించేందుకు ప్రయత్నిస్తున్నాడు. దీన్ని అ డ్డుకునేందుకు అన్ని విపక్ష పార్టీలను ఏకం చేసి దేశాన్ని కాపాడుకోవాలనే లక్ష్యంతోనే కాంగ్రెస్‌తో చంద్రబాబు దోస్తీ చేస్తు న్నారు. కాంగ్రెస్‌తో జట్టుకట్టడం నాకు ఇష్టం లేకపోయినా అధిష్ఠానం నిర్ణయానికి తలవంచక తప్పదు”.
అయిన పాత్రుడు వంతు అయిపోయింది. ఇక కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే తాను ఉరి వేసుకుంటానని చెప్పిన ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి కూడా రేపు మాపో చంద్రబాబు నిర్ణయాన్ని సమర్థిస్తూ వ్యాఖ్య కానీ ప్రకటన కానీ చేయవచ్చు.