పవన్ సిద్ధు, కామ్నా సింగ్, నిషిత హీరో హీరోయిన్లుగా యానీ క్రియేషన్స్ బ్యానర్ పై కిరణ్ కుమార్ దర్శకత్వంలో గంటా రామక్రిష్ణా నిర్మించిన చిత్రం అయ్యో రామ. సంతోష్ కవల సంగీతం అందించిన ఈ సినిమా పాటలను బుధవారం జరిగిన ఆడియో కార్యక్రమంలో బిగ్ సీడీని బి.జె.పి ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి ఆవిష్కించారు. ఆడియో సీడీలను దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి ఆవిష్కరించి తొలిసీడీని తుమ్మలపల్లి రామసత్యనారాయణకు అందించారు. బ్యానర్ లోగోను మహర్షి చాముండేశ్వరి నాథ్ ఆవిష్కరించారు.
చింతల రాంచంద్రారెడ్డి మాట్లాడుతూ ‘’సినిమా ట్రైలర్స్, పాటలు బావున్నాయి. సినిమాను ఈ స్టేజ్ కు తీసుకురావడమంటే చిన్న విషయం కాదు. నిర్మాత ఎన్నో కష్టనష్టాలకోర్చి సినిమాను నిర్మిస్తాడు. ఈ సినిమా దర్శకుడికి మంచి పేరు, నిర్మాతకు లాభాలు రావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
నిర్మాత గంటా రామక్రిష్ణారెడ్డి మాట్లాడుతూ ‘’పాటలు బాగా వచ్చాయి. మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది. దర్శకుడు సంతోష్ కవల మంచి సంగీతాన్ని అందించారు. దర్శకుడు సినిమాను చక్కగా తెరకెక్కించారు’’ అన్నారు.
దర్శకుడు కిరణ్ కుమార్ మాట్లాడుతూ ‘’ఈ సినిమా కోసం రాజేష్ మంచి కథను సిద్ధం చేశారు. పృథ్వీ, చందు టీం అంతా బాగా సపోర్ట్ చేశారు. సంతోష్ సంగీతం, సుమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పవన్, విజయ్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అవుతాయి. నా పై నమ్మకంతో ఈ సినిమాను ఎక్కడా వెనుకాడకుండా నిర్మించిన నిర్మాత గారికి థాంక్స్. సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు.
తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ ‘’యంగ్ టీమ్ అంతా కలసి చేసిన మంచి ప్రయత్నం. సినిమా ట్రైలర్, సాంగ్స్ చూస్తుంటే చాలా ఫ్రెష్ అనే ఫీల్ కలుగుతుంది. ఈ ఏడాది చిన్న సినిమాలు మంచి విజయాలను సాధించాయి. అదేవిధంగా ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ‘’సినిమా యూనిట్ ను అభినందిస్తున్నాను. ఈ సినిమా విజయం అందరికీ ఇన్సిపిరేషన్ కావాలి’’ అన్నారు.
మహర్షి చాముండేశ్వరి నాథ్ మాట్లాడుతూ ‘’ట్రైలర్స్, సాంగ్స్ బావున్నాయి. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించి టీంకు మంచి పేరు రావడమే కాకుండా భవిష్యత్ లో మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను’’అన్నారు.
హీరో పవన్ సిద్ధు మాట్లాడుతూ ‘’దర్శక నిర్మాతలు అందించిన సపోర్ట్ మరచిపోలేను. మా యూనిట్ పై నమ్మకంతో ఈ సినిమాను నిర్మించిన నిర్మాతకు థాంక్స్. తప్పకుండా మా ప్రయత్నాని ఆశీర్వదిస్తారని నమ్మకం ఉంది’’ అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ కవల మాట్లాడుతూ ‘’సినిమాలో మంచి మ్యూజిక్ కుదిరింది. నా పై నమ్మకంతో అవకాశాన్నిచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్’’ అన్నారు.
ఈ కార్యక్రమంలో బి.జె.సి. రాష్ట్ర సెక్రటరీ రంగారెడ్డి, కపిల్ రాజు తదితరులు పాల్గొని చిత్ర యూనిట్ ను అభినందించారు.
చంద్రమోహన్, మెల్కోటి, పూర్ణిమ, చంటి, చమ్మక్ చంద్ర, రచ్చరవి, రాఘవ, రామ్ ప్రసాద్ తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి కథ, మాటలు: రాజేష్ కుమార్ మూడునూరి, కెమెరా: పవన్-విజయ్, ఆర్.ఆర్: సుమన్ జూపూడి, ఎడిటింగ్: అనిల్ రాజ్, నిర్మాత: గంగా రామక్రిష్ణా దర్శకత్వం: కిరణ్ కుమార్.