కాంగ్రెస్‌కు భారమైన సీనియర్లు ఒక్కొక్కరుగా వెళ్లిపోతున్నారు. తాజాగా గులాం నబీ ఆజాద్ గుడ్ బై చెప్పారు. ఆయన కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీలో అలజడి రేపుతున్నారు. ఇటీవల కశ్మీర్లో పార్టీ బాధ్యతలు ఇచ్చినా వద్దన్నారు. అప్పుడే ఆయన కాంగ్రెస్‌ను వదిలేయడం ఖాయమని తేలిపోయింది. గులాం నబీ ఆజాద్ పదవీ కాలం ముగుస్తున్న సమయంలో రాజ్యసభలో ప్రధాని మోడీ ఆయన కోసం కన్నీళ్లు పెట్టుకున్నారు. అది చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. వాళ్ల మధ్య అంత గొప్ప అనుబందం ఉందా అనుకున్నారు.
ఆ తర్వాత రాజ్యసభ సీట్ల భర్తీకి కొన్ని చాన్సులు వచ్చినా ఆజాద్‌కు హైకమాండ్‌కు అవకాశం కల్పించలేదు. అదే సమయంలో బీజేపీ ఆజాద్‌ను రాష్ట్రపతి లేదా ఉపరాష్ట్రపతి బరిలో దింపుతుందన్న ప్రచారం కూడా జరిగింది. కానీ అలా జరగలేదు. ఆయితే ఆయన బీజేపీలో చేరడం మాత్రం ఖాయమని భావిస్తున్నారు. కశ్మీర్లో బీజేపీ తరపున ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారని అంటున్నారు. అదే జరిగిదే… కాంగ్రెస్ సీనియర్లను బీజేపీ తమ పార్టీలో చేర్చుకుని ముఖ్యమంత్రులను చేస్తున్నట్లవుతుంది.
ఇప్పటికే అస్సాం కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన నేతనే. ఇటీవల కాంగ్రెస్ నుంచి కపిల్ సిబల్ వెళ్లిపోయారు. ఆయనఎస్పీలో చేరి రాజ్యసభ సభ్యుడయ్యారు. కాంగ్రెస్‌లో ఇలా తెల్ల ఏనుగులా మారిన సీనియర్లందరూ వెళ్లిపోతూండటం.. బయటకు అలజడి రేగుతున్న కనిపిస్తున్నా.. అంతర్గతంగా మాత్రం కాంగ్రెస్‌లో రిలీఫ్ ఫీలవుతున్నారు.