మోహన్‌లాల్, గౌతమి కలసి నటించిన చిత్రం మనమంతా. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా రేపు విడుదల కాబోతోంది. ఈ సినిమా ఎఫెక్ట్ ఇప్పుడు బాహుబలి 2పై పడింది. అవును… మనమంతా కోసం బాహుబలి టీమ్ తన షూటింగ్ క్యాన్సిల్ చేసుకొంది. రాజమౌళి, కీరవాణి, రమా రాజమౌళి…. వీళ్లంతా మనమంతా సినిమా చూడబోతున్నారు. రేపు ఉదయం 9 గంటల షోకి టికెట్లుకూడా బుక్ చేసుకొన్నార్ట. ఈ సినిమా కోసమే బాహుబలి షూటింగ్‌ని కాన్సిల్ చేసుకొంది రాజమౌళి అండ్ కో.
చంద్రశేఖర్ యేలేటికీ.. రాజమౌళికీ మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. దానికి తోడు మనమంతా ప్రొడ్యూసర్ సాయి కొర్రపాటి బాగా కావాల్సిన వ్యక్తి. అందుకే… రాజమౌళి ఈ సినిమాని చూడాలని డిసైడ్ అయ్యాడట. ప్రసాద్ ఐమాక్స్‌లో రాజమౌళి బృందం కోసం, మీడియా ప్రతినిధుల కోసం ప్రత్యేకంగా ఓ షో వేయబోతున్నారు కూడా. ప్రభాస్ కూడా ఈ చిత్రాన్ని చూసే అవకాశం ఉందని తెలుస్తోంది. రాజమౌళికి సినిమా నచ్చితే ఓ రేంజులో మోసేస్తారాయన. ట్విట్టర్లో ఆయన కామెంట్లు కూడా సినిమా ప్రమోషన్ కి బాగా ఉపయోగపడతాయని చిత్రబృందం భావిస్తోంది.