బాహుబలి సెకండ్ పార్ట్ అవుతున్న ఈ సందర్భంలో బాహుబలికి మూడో పార్ట్ కూడా ఉంటుందన్న వార్తలు బాగా ఊపందుకున్నాయ్. రాజమౌలి కూడా దీన్ని తిరస్కరించకపోవడంతో బాహుబలి-3 కూడా ఉంటుందని భావించారు ప్రేక్షకులు. అయితే నిన్న బుల్లితెరలో వచ్చి సందడి చేసిన బాహుబలి సినిమా మధ్య మధ్యలో ఆ సినిమా దర్శకుడు రాజమౌలి, ప్రభాస్ మాట్లాడారు. బాహుబలి-2 లోనే ఆ సినిమా కన్ క్లూజన్ ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు.
హమ్మయ్య బాహుబలి-2 తోనే ఆ సినిమాకి ఎండ్ అని అనుకుంటున్న టైంలో బాహుబలి-3 కూడా ఉంటుంది కాని అది ఈ కథకు సంబంధం లేకుండా ఉంటుందని మరో మెలిక పెట్టాడు జక్కన్న. దీన్ని బట్టి చూస్తుంటే రాజమౌలి చాలా పెద్ద ప్లానే వేసినట్టున్నాడనిపిస్తుంది. మరి రికార్డుల మోత మోగించిన బాహుబలికి సెకండ్ పార్ట్ గా వస్తున్నా బాహుబలి-2 ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.