హైదరాబాద్: బాక్సాఫీస్వద్ద బాహుబలి, భజరంగీ భాయ్‌జాన్ చిత్రాల ప్రభంజనం కొనసాగుతోంది. బాహుబలి తొమ్మిది రోజుల్లో రు.300 కోట్లు కొల్లగొట్టగా, సల్మాన్ ఖాన్ చిత్రం భజరంగీ భాయ్‌జాన్ మొదటి వారాంతానికే మూడురోజుల్లో రు.100 కోట్ల మైలురాయిని దాటింది. బాలీవుడ్లో వందకోట్ల మైలురాయిని ఇంత తక్కువకాలంలో అధిగమించిన చిత్రం ఇంతకుముందు మరేదీలేకపోవటం విశేషం. ఆమీర్ ఖాన్ చిత్రం పీకే, షారుక్ ఖాన్ చిత్రం హ్యాపీ న్యూ ఇయర్ మొదటి వారాంతానికి వందకోట్ల మైలురాయిని కొద్దిలో మిస్ అయ్యాయి. మరోవైపు సల్మాన్‌కు వందకోట్లు దాటిన చిత్రాలు భజరంగీతో ఎనిమిదయ్యాయి. ఈ ఘనతకూడా బాలీవుడ్లో మరెవరికీ లేదు. సల్మాన్ తదుపరి చిత్రం సూరజ్ బర్జాత్యా(హమ్ ఆప్కేహై కౌన్, మైనే ప్యార్ కియా)దర్శకత్వంలో రూపొందుతోంది. ప్రేమ్ రతన్ ధన్ పాయో అనే ఈ చిత్రం దీపావళికి విడుదలయ్యే అవకాశాలున్నాయి.
మరోవైపు బాహుబలి హవా కొనసాగుతోంది. తొమ్మిదిరోజుల్లో రు.303 కోట్లను వసూలుచేసింది. రజనీకాంత్ బ్లాక్ బస్టర్ రోబో మొత్తం మీద సాధించిన రు.290 కోట్లను ఇది తొమ్మిదిరోజుల్లో అధిగమించటం విశేషం. అయితే సల్మాన్ ఖాన్ చిత్రం భజరంగీ భాయ్‌జాన్ విడదల ప్రభావంతో పదవరోజున కలెక్షన్లు కొద్దిగా తగ్గాయి. ఒక దక్షిణాది చిత్రం రు.300 కోట్ల మైలురాయిని అధిగమించటం ఇదే ప్రథమం. పూర్తి రన్లో ఇది ఎంత సాధిస్తుందో ఊహకందటంలేదు.