మెగాస్టార్ చిరంజీవి బాస్ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నారు. తన స్టామినా మరోసారి నిరూపించారు. మెగాస్టార్ రీఎంట్రీ చిత్రం, 150వ చిత్రం.. ‘ఖైదీ నెం 150’తో మరోసారి బాక్సాఫీసును దోచేశారు చిరు. అటు ఫ్యాన్స్ ఆకలి తీర్చేసిన మెగాస్టార్ .. బాక్సాఫీసు బాస్ అని కూడా అనిపించేశారు. పండక్కి విడుదలై ఈ చిత్రం వందకోట్ల కలెక్షన్ దాటిపోయిందని మార్కెట్ వర్గాలు లెక్కకట్టేశాయి. మొత్తంమ్మీద అదిరిపోయే రీఎంట్రీ ఇచ్చి బాస్ ఈజ్ బ్యాక్ అని నిరూపించుకున్నారాయన. ప్రస్తుతం ఆయన కొత్త సినిమా కోసం రెడీ అవుతున్నారు. 151వ చిత్రంగా ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ని చేయాలనే ఆలోచనలో చిరు వున్నట్లు ఇదివరకే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డిని దర్శుడిగా అనుకుంటున్నారు కానీ దీనిపై ఇంకా తుది నిర్ణయానికి రాలేదు.
ఈ ప్రాజెక్ట్ కు సంబధించిన లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే.. చరిత్ర నేపధ్యం వున్న ఈ చిత్రంలో భారీగా ‘విఎఫ్ ఎక్స్’ కు అవకాశం వుందట. ఈ విషయంలో రామ్ చరణ్ అప్పుడే అన్వేషణ మొదలుపెట్టాడని తెలుస్తోంది. ఇందుకోసం బాహుబలి ‘విఎఫ్ ఎక్స్’ ను సంప్రదించాడట చెర్రీ. దీనికి కోసం ఎనభై శతకం నాటి బ్యాడ్రాప్ ను సెట్ చేయాలి, అలాగే చాలా గ్రాఫిక్ వర్క్ కూడా ఉటుంది. ఇప్పుడా భాద్యతను బాహుబలి టీం కు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడట చరణ్. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పై ఇంకా కసరత్తులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాపై ఓ ప్రకటన వచ్చే అవకాశం వుంది.