రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ – చరణ్‌ల కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ మల్టీస్టారర్‌కి సాంకేతిక నిపుణుల ఎంపిక దాదాపుగా ఖాయమైపోయింది. సంగీతం బాధ్యతని ఎప్పటిలా.. కీరవాణి కి అప్పగించారు. కెమెరా సెంథిల్ కుమార్ చేతికి వెళ్లింది. ఆర్ట్ విభాగం పనుల్ని సాబూ సిరిల్ చూసుకుంటారు. ఈ ముగ్గురూ ‘బాహుబలి 1’, ‘బాహుబలి 2’కి పనిచేసిన సంగతి తెలిసిందే. ఫైట్ మాస్టర్ గా పీటర్ హెయిన్స్ పనిచేయబోతున్నారు. ఈయనా బాహుబలి సభ్యుడే. సెంటిమెంట్ పరంగా, ఎటాచ్మెంట్ పరంగా ఆలోచించిన రాజమౌళి మరోసారి బాహుబలి టీమ్‌నే ఎంచుకున్నట్టు స్పష్టమవుతోంది. ఈ చిత్రానికి కథ విజయేంద్ర ప్రసాద్ అందించనున్నారు. ఇప్పటికే స్టోరీ సిద్ధమైంది. ప్రస్తుతం స్క్రీన్ ప్లే వర్క్ సాగుతోంది. దసరా తరవాత.. ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లబోతోంది. 1947 కి ముందు జరిగే కథ ఇది. పునర్జన్మల నేపథ్యంలో కథ సాగుతుందని ప్రచారం జరుగుతోంది. కానీ.. ఇందులో అలాంటి ఎలిమెంట్స్ ఏమీ లేవని తెలుస్తోంది.