బాలీవుడ్ జనాలకు షాక్ ఇచ్చిన సినిమా.. హంటర్! సినిమా కాస్త అటూ ఇటూగా బ్లూ ఫిల్మ్ రేంజులో ఉంటుంది. అయితే.. ఎంత బోల్డ్‌గా ఉన్నా.. దానికి తగిన ఎమోషన్ని క్యారీ చేయగలిగాడు. అందుకే అక్కడ హిట్టయ్యింది. ఇప్పుడీ సినిమాని తెలుగులో రీమేక్ చేశారు. బాబు బాగా బిజీ అంటూ! కథకి తగిన టైటిల్. ఈ బాబుగారు… ఎందులో బిజీగా ఉంటారో తెలుసా? అమ్మాయిల్నీ, ఆంటీల్నీ పడేయడంలో. స్కోరెంత? అని అడిగితే.. స్కోర్ ఎంత అంటే ఎన్నిసార్లనా?? ఎంతమందిననా?? అని సెక్సీగా అడిగేకరం. ఇక ఈ సినిమా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లెద్దు. టైటిల్ తో ఆకట్టుకొన్న ఈసినిమా.. ఇప్పుడు ట్రైలర్‌తో బెదరగొట్టింది. తెలుగు ప్రేక్షకులు సెక్సీదనాన్నీ, సెక్స్నీ ఇష్టపడతారేమోగానీ… మరీ ఈ రేంజులో కాదు. బోల్డు సీన్లు బోల్డన్ని ఉన్నాయ్ ఇందులో. అవసరాల శ్రీనివాస్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ డిఫరెంట్‌గా కనిపించబోతోంది. మాతృకతో పోలిస్తే కథలో, పాత్రల్లో పెద్ద పెద్ద మార్పులేం ఉండకపోవొచ్చు. కానీ ఫన్ మాత్రం బాగానే పండిందన్న విషయం ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ముందే హెచ్చరించేస్తున్నాం.. ఈసినిమాకి ఫ్యామిలీతో చూళ్లేం. ఆ సాహసం చేయకండి. కావాలంటే టచింగ్కి ఈ ట్రైలర్ చూడండి. మీకే అర్థమైపోతుంది.