పోలవరం ప్రాజెక్టు వ్యవహారం ఇప్పుడు రసకందాయంలో పడుతున్నట్లుంది. పోలవరం ప్రాజెక్టుకు ఏటా వంద కోట్లు ముష్టి లాగా విదిలించిన నేపధ్యంలో చంద్రబాబు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్న సంగతి అందరికి తెలుసు. జాతీయ ప్రాజెక్టు అయిన పొలవరాన్ని కేంద్రం పట్టించుకునే తీరు ఇదేనా అనే విమర్శలు కూడా వస్తూన్నాయి. ఇలాంటి సమయంలో పోలవరం నిర్మాణ బాధ్యతను కేంద్రానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అంటూ సీఎం చంద్రబాబు ప్రకటించడం చర్చనీయాంశంగ ఉంది.
వివరాల్లోకి వెళితే …
మొన్నటి వరకు బీజేపీ ని ఎవరు తిట్టినా సరే ఈ విషయంలో వారు రాష్ట్ర సర్కారు మీదనే నెపం వేస్తూ వచ్చారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు గనుక , నిర్మాణ అథారిటీ కి అప్పగించకుండా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో పెట్టుకుంటే ఎలా అని కేంద్రం తప్పించుకుంటు వచ్చింది. అయితే ఇప్పుడు చంద్రబాబు ఇచ్చేస్తా అంటున్నారు.
కానీ మధ్యలో ఒక మతలబు ఉంది. చంద్రబాబు సర్కారు పోలవరం బడ్జెట్ ను రివైజ్ చేసేసారు. బాబు సర్కారు అమాంతం వేల కోట్ల రూపాయలు భారం పెంచేసింది.
మరి భారం బాబు పెంచేసి బాధ్యత ను కేంద్రం చేతిలో పెట్టేస్తాం అంటే కుదురుతుందా. కేంద్రం ఒప్పుకుంటుందా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. బాబు తనకు కావలసిన వారికి తను తలచుకున్న మేలు చేసేసి, వరాలు ఇచ్చేసి .. ఆ వారలు తీర్చే పని కేంద్రం నెత్తిన పెడుతున్నట్లుంది. మరి కేంద్రం ఉన్నది ఉన్నట్లుగా ఈ ప్రతిపాదనకు ఒప్పుకుంటుందా.. అనేది అనుమానమే.