తెలుగు సినిమాల్లో తెలుగు అమ్మాయిలు హీరోయిన్లుగా కనిపించడం చాలా అరుదు. బేబీ సినిమాలో తెలుగు అమ్మాయే కావాలని దర్శకుడు సాయి రాజేష్ పట్టుబట్టి మరీ వైష్ణవి చైతన్య అనే ఓ తెలుగు అమ్మాయిని వెండి తెరకు పరిచయం చేశాడు. టిక్ టాక్ స్టార్‌గా పాపులర్ అయిన చైతన్యకు బేబీనే తెలుగు సినిమా. తొలి చిత్రంతోనే వైష్ణవి ఆకట్టుకొంది. తన అభినయంతో షాక్‌కి గురి చేసింది. ఈ సినిమా ద్వారా ఎక్కువ మార్కులు కొట్టేసింది తనే. నటన పక్కన పెడితే, కొన్ని బోల్డ్ సీన్స్‌లో కూడా నటించి షాక్ ఇచ్చింది. వైష్ణవిలో ఇంత ప్రతిభ ఉందా? అని చాలామంది ఆశ్చర్యపోయారు. బేబీ తరవాత ఆమెకు పుష్కలంగా అవకాశాలు రావడం ఖాయం. కమర్షియల్ కథల్లో వైష్ణవిని చూడడం కష్టమేమో గానీ, లవ్ స్టోరీలకు మాత్రం తను మంచి ఆప్షనే.
బేబీ తరవాత వైష్ణవికి ఎంక్వైరీలు మొదలయ్యాయి. అయితే తొలి సినిమా నిర్మాత (ఎస్.కే.ఎన్)కే వైష్ణవి మూడు సినిమాలు చేస్తానని ప్రామిస్ చేసింది. ఈ మేరకు ఎగ్రిమెంట్ కూడా చేసింది. అంటే తదుపరి రెండు చిత్రాలూ ఈ బ్యానర్‌పైనే చేయాలన్నయాట. గీతా ఆర్ట్స్, గీతా ఆర్ట్స్ 2 సంస్థల్లోనూ వైష్ణవి సినిమాలు చేసే ఛాన్స్ వుంది.