‘నాంది’ సినిమా తర్వాత అల్లరి నరేష్ రూటు మారింది. వరుసగా కామెడీ కథలు చేసే ఆయన ఒక్కసారిగా సీరియస్ కథలు వైపు చూశారు. రీసెంట్ గా ఆ ఒక్కటీ అడక్కు తో మరో కామెడీ చిత్రం చేసినా అది పెద్ద ఫలితం దక్కలేదు. ఇప్పుడు ఆయన నుంచి మరో సీరియస్ సినిమా వస్తోంది. అదే బచ్చల మల్లి. సోలో బ్రతుకే సో బెటరు ఫేం సుబ్బు ఈ సినిమాకి దర్శకుడు. రాజేష్ దండా, బాలాజీ గుత్తా చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ రోజు అల్లరి నరేష్ బర్త్ డే. ఈ సందర్భంగా సినిమా నుంచి గ్లింప్స్ ని వదిలారు. భగవద్గీత ప్లేయ్ అవుతున్న స్పీకర్ ని విసిరికొట్టడం, బార్ లో గొడవ, తర్వాత “ఏయ్ ఎవడి కోసం తగ్గాలి… ఎందుకు తగ్గాలి’ అనే నరేష్ చెప్పిన డైలాగ్ ఇందులో ఆయన క్యారెక్టర్ ఎంత మాస్ గా వుంటుందో చూపిస్తోంది. ముఖ్యంగా నరేష్ లుక్ చాలా కొత్తగా రగ్గడ్ గా వుంది. ఆయన ఇంత మాసీ గా కనిపించడం బహుసా ఇదే మొదటిసారి. గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచేలానే వుంది. సెప్టెంబర్ లో సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Happy birthday. Teaser bagundi funny movie lane undhi. Adochhemo .?