ఏపీ ప్రభుత్వం దుర్గ గుడి పాలక మండలి సభ్యులను నియమించింది. చైర్మన్ కర్నాటి రాంబాబు అంటే విజయవాడలో పేరు మోసిన కాల్ మనీ వ్యాపారి అని అందరికీ తెలుసు. ఇక సభ్యుల్లో ఒకరి పేరు అందర్నీ ఆకర్షించింది. ఆమె బచ్చు మాధవికృష్ణ. ఈమె గురించి చెప్పుకోవాలంటే.. ముందు మనం కొన్ని ఘటనల్ని గుర్తు చేసుకోవాలి.
టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపై దాడి జరిగింది. పసి పిల్లని కూడా వదలకుండా భయపెట్టి ఇంట్లో అంతా విధ్వంసం చేసి వచ్చింది ఓ గ్యాంగ్. ఈ గ్యాంగ్ కు నాయకత్వం వహించింది మహిళ. ఆమె పేరు బచ్చు మాధవి. ఈ కేసులో ఆమె ఏ వన్ నిందితురాలు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులోనూ ప్రత్యక్షంగా పాల్గొన్న కేసుకూడా ఆమెపై ఉంది. ఇటీవల దేవినేని అవినాష్ ను గడప గడపకూ కార్యక్రమంలో ఓ ముస్లిం మహిళ ప్రశ్నించిందని ఆమె ఇంటికి వెళ్లి కళ్లల్లో కారం కొట్టి దాడిచేసింది ఓ గ్యాంగ్. ఆ గ్యాంగ్ కు ప్రెసిడెంట్ బచ్చు మాధవి. ఆమె… ఇప్పుడు దుర్గగుడి పాలక మండలి సభ్యురాలు.
విజయవాడలో దేవినేని అవినాష్ నడిపే చిల్లర గ్యాంగుల్లో ఈమెది కీలక పాత్ర. కొంత మంది మహిళల్ని వెంటేసుకుని అవినాష్ చెప్పిన వారిపై దాడులు చేసి రావడమే వీరి పని. అధికారలో ఉన్నారు కాబట్టి… చట్టం వర్తించదు కాబట్టి ఆమె.. తను మహిళ అనే అడ్వాంటేజ్ ను వాడుకుని అవినాష్ చెప్పిన పనల్లా చేస్తారు. మహిళలను ఉపయోగించుకుని ఇలాంటి పనులేంటి అని అందరూ అవినాష్ పై సెటైర్లు వేస్తారు. అందుకే పదవి ఇప్పించారు.
దుర్గగుడి పాలకమండలిలో ఇలా నేరస్తులు చేరడం.. భక్తుల్ని కూడా ఆవేదనకు గురి చేస్తోంది. కానీ ఎవరూ నోరెత్తలేరు. ఎత్తితే బచ్చు మాధవి అండ్ గ్యాంగ్… కారం తీసుకుని ఇళ్లపై పడి దాడి చేసి కొడుతుంది. మహా అయితే కేసు అవుతుంది కానీ.. బాధితులు మాత్రం బాధపడాల్సిందే.