అల్లరి నరేష్… మినిమమ్ గ్యారెంటీ హీరో. నరేష్ సినిమా అంటే థియేటర్లు కిటకిటలాడుతాయి. సినిమా ఎలా ఉన్నా.. కామెడీ ఉంటుందన్న ఆశతో జనాలు థియేటర్లకు వెళ్తారు. అయితే ఇది గతం. ‘సుడిగాడు’ తర్వాత మళ్ళీ హిట్ ముఖం చూడలేదు. వరుసగా ఫ్లాపులు చవి చూశాడు. ‘సుడిగాడి’తో మొదలైయింది నరేష్ ఫ్లాపులు ప్రస్తానం. ఈ సినిమా ‘స్నూఫ్’ లతో ఓకే అనిపించింది. అయితే ఈ సినిమా తర్వాత ఫ్లాపులు వెంటాడాయి నరేష్ కి. యముడికి మొగుడు, యాక్షన్ త్రీడి, కెవ్వు కేక, లడ్డు బాబు, జంప్ జిలాని, బ్రదర్ అఫ్ బొమ్మలి, బందిపోటు, జేమ్స్ బాండ్ , మామ మంచు అల్లుడు కంచు, సెల్ఫీ రాజా… ఇలా ఫ్లాపులు వరుస కట్టేశాయి.
తాజాగా వచ్చిన ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’ కూడా నిరాశ పరిచింది. గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చినీ సినిమా నెగిటివ్ టాక్ ను మూటకట్టుకుంది. కథల ఎంపికలో నరేష్ చేస్తున్న తప్పుల్ని ఈ సినిమా మరోసారి ఎత్తిచూపింది. ఏమాత్రం కొత్తదనం లేని కధనంతో సినిమా విసిగించింది. హారర్ కామెడీ జోనర్లో వచ్చినీ సినిమా అటు కామెడీకి ఇటు హారర్ కీ తప్పింది. దెయ్యం క్యారెక్టర్ తో మిగతా క్యారెక్టర్లనీ కొట్టించడమే ఈ సినిమాలో హారర్-కామెడీ తప్పితే మరోటి కాదు. అసలు ఈ కథలో ఏం కొత్తదనం కనిపించలేదు. ప్రతీ సీను ఇదివరకూ చూసిన అనుభూతినే కలిచించింది. మొత్తంమ్మీద దెయ్యం రూపంలో నరేష్ ఖాతాలో మరో ఫ్లాఫు చేరిపోయింది.
ఒక్క విషయం మాత్రం చెప్పాలి. నరేష్ కి ఇపుడు రాంగ్ టైం నడుస్తోంది. ఇది వరకు స్పూఫ్ లతో బండి లాగించేవాడు నరేష్. అయితే ఇప్పుడవి వర్క్ అవుట్ కావడం లేదు. ఇవి చేయడానికి పృద్వీ , సప్తగిరిలతో పాటు జబర్దస్త్ బ్యాచ్ వుంది. వీళ్ళ పేరడీలు, స్పూపులు పేలుతున్నాయి. హీరోగా ఇప్పుడు నరేష్ ఇలాంటి చేస్తుంటే ప్రేక్షకులకు ఎబ్బెట్టుగా వుటుంది . అలాగే కథలను జడ్జ్ చేయడంలో లోపం స్పష్టంగా కనిపిస్తుంది. నరేష్ బాడీలాంగ్వేజ్ ఇప్పుడు ఆయన ఎంచుకుంటున్న కథలకు మ్యాచ్ కావడం లేదు. అసలు తనకు ఎలాంటి కథలు షూట్ అవుతాయో తేల్చుకోలేకపోతున్నాడనిపిస్తోంది నరేశ్ నుండి వస్తున్న సినిమాలను చూస్తుంటే.
మొత్తంమ్మీద ఇప్పుడు పూర్తిగా ట్రాక్ తప్పేశాడు నరేష్. నరేష్ సినిమా అంటే లైట్ తీసుకోనే పరిస్థితి. అయితే ఈ పరిస్థితి మారడానికి ఒక్క హిట్ చాలు. తన బాడీలాంగ్వేజ్ కు సరిపోయే ఓ చక్కటి కథను ఎంపిక చేసుకొని ప్రేక్షకులతో ‘హిట్’ అనిపించుకోవాల్సిన అవసరం ఇపుడు ఎంతైనా వుంది నరేశ్ కి. త్వరలో నరేష్ నుండి రాబోయే చిత్రంతోనే ఆ హిట్టు దక్కాలని కోరుకుందాం.