హైదరాబాద్‌లో మధ్యతరగతి ప్రజలు ఉండటానికి ఎన్నో అనువైన ప్రాంతాలు ఉన్నాయి. అయితే కొన్ని హాట్ ప్రాపర్టీలుగా ఉన్న ప్రాంతాలకే ప్రచారం లభిస్తుంది. పెద్దగా ప్రచారం లభించని ఏరియాల్లో ఒకటి బుద్వేలే. అటు శంషాబాద్ కు..ఇటు సిటీకి మధ్యలో ఉంటే ఈ గ్రామం చుట్టూ రియల్ ఎస్టేట్ వెంచర్లు ఉన్నాయి. కాలనీల నిర్మాణం వేగంగా జరుగుతోంది. ధరలు కూడా మధ్యతరగతి వారికి అందుబాటులో ఉంటున్నాయి.
కోకాపేటలో ఎకరం వంద కోట్లకు ప్రభుత్వం వేలం వేసి అమ్మేసిన తర్వాత .. బుద్వేల్‌లో ప్లాట్లను కేసీఆర్ ప్రభుత్వం వేలం వేసింది. అప్పుడే బుద్వేల్ గురించి అందరికీ అవగాహన వచ్చింది. హెచ్ఎండీఏ ఇక్కడ దాదాపుగా వంద ఎకరాల స్థలాన్ని మౌలిక వసతులతో అభివృద్ధి చేసి .. వేలం వేసింది. 100 ఎకరాలకు రికార్డు స్థాయిలో రూ.3,625 కోట్ల ఆదాయం లభించింది. అంటే ఎకరం సగటున ముఫ్పై కోట్లకుపైగా పలికిందన్నమాట.
బుద్వేల్‌కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకవైపు హిమాయత్‌సాగర్ ఉండగా, మరోవైపు శంషాబాద్ విమానాశ్రయం ఉన్నాయి. రాజేంద్రనగర్‌లో ఓఆర్ఆర్ ఎగ్జిట్ రోడ్డుకు అతి సమీపంలో బుద్వేల్ ఉంటుంద. ఇక్కడి నుంచి విమానాశ్రయం, ఐటీ కారిడార్లకు సులువుగా చేరుకునే అవకాశాలున్నాయి. ఈ భూముల వేలం తర్వాత బుద్వేల్ లో హెచ్ఎండీఏ భూముల వేలంతో రియల్ ఎస్టేట్ స్పీడందుకుంది. ఇక్కడ ప్రస్తుతం 25 వరకు అపార్ట్ మెంట్స్, విల్లా ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి.
బుద్వేల్‌లో ప్రస్తుతం అపార్టుమెంట్లు యాభై లక్షల నుంచి లభిస్తున్నాయి. విల్లా ప్రాజెక్టులు కూడా రూ. కోటిన్నర నుంచి లభిస్తున్నాయి. చిన్న చిన్న బిల్డర్లకు రెరా ఉండదు. వారు మేస్త్రీలు. ఒకటి రెండు అపార్టుమెంట్లు కట్టిఅమ్ముతూంటారు. వారి వద్ద రెడీ అయిపోయిన ఇళ్లను కొనుగోలు చేస్తే రిస్క్ ఉండదు. తక్కువకే వస్తాయి. ఇంకా నిర్మాణంలో ఉన్న ఇళ్లు కొనాలంటే.. రెరా అనుమతి ఉన్న వాటికి ప్రాధాన్యం ఇస్తే బెటర్.