బాహుబలి సినిమా మొదటి భాగం ఊహించినదాని కంటే చాలా గొప్ప విజయం సాధించిన తరువాత ఆ సినిమా దర్శకుడు రాజమౌళి దాని రెండవ భాగం షూటింగ్ క్రిందటి నెల రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభించారు. అక్కడ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసిన తరువాత, కేరళలో కన్నూర్ వద్ద గల దట్టమయిన అటవీ ప్రాంతంలో రెండు వారాల పాటు ప్రధాన తారాగణంపై కొన్ని ముఖ్యమయిన సన్నివేశాలు చిత్రీకరించారు. నిన్నటితో రెండవ షెడ్యూల్ కూడా పూర్తయింది. మళ్ళీ కొన్ని రోజులు విరామం తీసుకొన్న తరువాత షూటింగ్ మొదలుపెడతారు. ప్రభాస్, రాణా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, నాజర్ తదితరులు నటిస్తున్న ఈ సినిమా ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.