రజనీకాంత్ మానియా మొదలైపోయింది. పాత రికార్డులన్నింటికీ కబాలితో చెదలు పడుతున్నాయి. ముఖ్యంగా బాహుబలి రికార్డులు కబాలి దెబ్బకు చెల్లాచెదురైపోతున్నాయి. బాహుబలి ని దాదాపుగా 5000 థియేటర్లలో విడుదల చేశారు. అప్పట్లో ఇది రికార్డ్. ఇప్పుడు కబాలి.. ఆ సంఖ్యను దాటేసింది. 5200 తెరలపై కబాలికి ప్రదర్శించబోతున్నారు. ఓ సౌత్ ఇండియన్ సినిమా ఇన్ని తెరలపై విడుదల కావడం ఓ రికార్డ్. బాహుబలి ప్రీ రిలీజ్ బిజినెస్‌తో పోలిస్తే.. కబాలి రూ.50 కోట్లు ఎక్కువే చేసింది. బాహుబలి బిజినెస్ రూ.150 కోట్లకు పరిమితమైతే.. కబాలి రెండొందల కోట్లు అందుకొంది. బాహుబలిని మొదట నాలుగు భాషల్లోనే విడుదల చేశారు. కబాలి మాత్రం నేరుగా 8 భాషల్లో విడుదల అవుతోంది.
బాహుబలి ప్రచార చిత్రాన్ని యూ ట్యూబ్‌లో కోటిమందికి పైగా వీక్షించారు. కబాలి ఆ అంకెని ఎప్పుడో దాటేసింది. అన్ని లింకులను కలుపుకొని రెండు కోట్లకు పైగానే ఈ ట్రైలర్‌ని వీక్షించారు. అదీ.. తక్కువ సమయంలోనే. ఇలా బాహుబలికి సంబంధించిన ప్రతీ రికార్డునీ కబాలి బీట్ చేసుకొంటూ వెళ్లుంది. మరి… ఈ పరంపర ఎక్కడ వరకూ సాగుతుందో చూడాలి. కబాలి ఎన్ని రికార్డులు బద్దలు కొట్టినా రూ.600 కోట్ల రికార్డుని మాత్రం టచ్ చేయడం అసాధ్యమని ట్రేడ్ వర్గాలు లెక్క గడుతున్నాయి. కబాలి టార్గెట్ కూడా రూ.500 కోట్లే. కాబట్టి ఆ రికార్డు మాత్రం పదిలంగా ఉండిపోవొచ్చు.