బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ప్రకటించారు. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవడం లేదనిక ప్రకటించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీతో మాయావతి పార్టీ పొత్తు పెట్టుకుంది. ఈ సారి కూడా పొత్తులు పెట్టుకుంటుందని మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీన్ని మాయావతి ఖండించారు. రకరకాల పుకార్లు పుట్టిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడం ఖాయమన్నారు.
ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని మాయావతి కొన్ని వారాల క్రితం మీడియా సమావేశంలో ప్రకటించారు. బీఎస్పీ, కాంగ్రెస్‌ల పొత్తు పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో రెండు పార్టీలకు మేలు చేస్తుందని చెబుతున్నారు. కానీ మాయావతి మాత్రం అలాంటి ఆలోచన లేదంటున్నారు. ల మాయవతి ప్రకటనతో తెలంగాణలో పొత్తులపై చర్చ ప్రారంభమమయింది. బీఆర్ఎస్ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ తో సమావేశమై పొత్తుల గురించి చర్చించారు. కలిసి పోటీ చేస్తామన్నారు.
అయితే తాము ఇంకా మాయవతితో మాట్లాడలేదని.. మాట్లాడిన తర్వాత విధి విధానాలు ప్రకటిస్తామన్నారు. మూడు రోజులు గుడిచినా రెండ వైపుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో తెలంగాణలో బీఆర్ఎస్, బీఎస్పీ మధ్య పొత్తుపై అనుమానాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ పొత్తులు పెద్ద మ్యాటర్ కాదు కాబట్టి.. మాయవతి గ్రీన్ సిగ్నల్ ఇవ్వొచ్చని అనుకుంటున్నారు. కానీ బీఆర్ఎస్ తో అంటే.. ఆలోచించాల్సిన పరిస్థితి ఉందంటున్నారు. ఏదైనా మళ్లీ ప్రవీణ్ కుమార్ అధికారిక ప్రకటన చేస్తే తప్ప క్లారిటీ రాకపోవచ్చు.