ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. విచారణ పూర్తయ్యే వరకూ ఈ బెయిల్ ఉంటుంది. ఆయన తన రాజకీయ అవసరాలను దెబ్బకొట్టేందుకు .. ఎన్నికల్లో పోటీ, ప్రచారం చేయకుండా చేసేందుకు కేసులో ఇరికించిందని కోర్టు ముందు బలంగా వాదించారు. అదే సమయంలో సంజయ్ సింగ్ కు డబ్బు ఎలా చేరిందన్న దానిపై ఈడీ ఆధారాలు చూపించలేకపోయింది. దీంతో సంచలనాత్మక రీతిలో బెయిల్ మంజూరు అయింది .
కవితకు కూడా లోక్సభ టిక్కెట్ ఇచ్చి ఉంటే..దాన్నే కారణంగా చూపి.. ఆమె కూడా బెయిల్ తెచ్చుకునే అవకాశం ఉండేదన్న అభిప్రాయం న్యాయవర్గాల్లో వినిపిస్తోంది. ఆమె సిట్టింగ్ ఎంపీ కానప్పటికీ.. .బీఆర్ఎస్ తరపున ప్రచారం చేయడంలో కీలకంగా ఉంటారు. ఆమె రాజకీయ అవకాశాలను నిరూపితం కాని కేసులో… కస్టడీ కూడా పూర్తయిన తర్వాత జైల్లో ఉంచాల్సిన అవసరం లేదు. కానీ ఈడీ బెయిల్ రాకుండా గట్టిగా వాదిస్తోంది. ఇలాంటి సమయంలో సంజయ్ సింగ్ కు బెయిల్ లభించిన దారి .. అందరికీ ఓ అవకాశం అనుకోవచ్చు.
అయితే ఇప్పుడు కవిత పూర్తిగా రాజకీయాలకు దూరం పాటించాలని నిర్ణయించుకున్నారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఢిల్లీలోని తీహార్ జైలులో ఉంటున్న కవిత తనకు జపమాల, చదువుకోవటానికి ఆధ్యాత్మిక పుస్తకాలు, మెడిటేషన్ చేసుకునేందుకు అనుమతి కోరారు. అలాగే చదువుకోవటానికి ఇతరత్రా పుస్తకాలను కూడా అడిగారు. అందుకు కోర్టు కూడా సానుకూలంగా స్పందించింది. కవిత అడిగిన జపమాల, మెడిటేషన్ కు అనుమతివ్వమని, చదువుకోవటానికి ఆధ్యాత్మిక పుస్తకాలు ఇవ్వమని తీహార్ జైలు అధికారులను రౌస్ ఎవిన్యు కోర్టు ఆదేశించింది. బెయిల్ వచ్చినా ఆమె రాజకీయాలు చేయబోరని అంటున్నారు.