హైదరాబాద్: విజయవాడలో సంచలనం సృష్టించిన కాల్‌మనీ కేసులో ముగ్గురు నిందితులకు ఇవాళ బెయిల్ లభించింది. ప్రధాన నిందితులైన యలమంచిలి రాము, భవానీ శంకర్, దూడల రాజేష్‌లకు కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల పూచీకత్తుతో వీరికి విజయవాడ రెండో ఛీఫ్ మెట్రోపాలిటన మేజిస్ట్రేట్ కోర్ట్ షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. అయితే వీరిని పోలీసులు మరొక కేసులో అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఈ కేసులో మరో నిందితుడు, ప్రభుత్వోద్యోగి సత్యానందంకు ఇటీవల బెయిల్ మంజూరు అయినప్పటికీ, వేరే కేసులో మళ్ళీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే.