ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. అదే తుది చార్జిషీటు ఇక దర్యాప్తు పూర్తయిందని కోర్టుకు తెలిపింది. ఇక నిందితులకు బెయిల్స్ కోసం గట్టిగా వాదించుకునే అవకాశం ఉంటుంది. మామూలుగా దర్యాప్తు పూర్తయ్యే వరకే నిందితుల్ని గట్టిగా జైలులో ఉంచాలని దర్యాప్తు సంస్థలు కోరుతాయి. ప్రస్తుతం ఈడీ కేసులో బెయిల్ పొందిన కేజ్రీవాల్.. సీబీఐ కేసులోనూ బెయిల్ కోసం ఎదురు చూస్తున్నారు. తదుపరి విచారణలో ఆయనకు బెయిల్ దక్కే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది.
దాదాపుగా మూడేళ్ల నుంచి జరుగుతున్న లిక్కర్ స్కాంలో వరుసగా అరెస్టులు జరిగాయి. ఇతర కేసుల మాదిరిగా కాకుండా అరెస్టులు అయిన వాళ్లు బయటకు రావడానికి చాలా తంటాలు పడాల్సి వచ్చింది. చాలా మంది అప్రూవర్లుగా మారి బయటపడ్డారు. కానీ కేజ్రీవాల్, సిసోడియాతో పాటు కవిత కూడా జైలు నుంచి బయటు రావడానికి నెలల తరబడి పోరాటం చేయాల్సి వస్తోంది. ఇప్పటికీ ఆశనిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటి వరకూ ఈడీ అనుబంధ చార్జిషీట్లు దాఖలు చేస్తూ వచ్చింది.
Read Also : ఏపీ లిక్కర్ స్కాం – ఓ కేస్ స్టడీ !
ఓ కేసులో ఇన్ని నెలల పాటు దర్యాప్తు పేరుతో జైల్లో పెట్టడం సరి కాదన్న వాదన కూడా ఉంది. ఎట్టకేలకు.. సీబీఐ దర్యాప్తు పూర్తయిందని చెప్పి తుది చార్జిషీటు దాఖలు చేయడంతో నిందితులు ఇక ట్రయల్ ఎదుర్కోవాల్సి ఉంది. అయితే అందుకు జైల్లో ఉండాల్సిన అవసరం ఉండదు. ఈ వాదన వినిపించి .. లిక్కర్ కేసు నిందితులు ఎలాగోలా బెయిల్ పై బయడపడే అవకాశాలు ఉన్నాయి. కేజ్రీవాల్ జైల్లో ఉంటే ఆయనపై సానుభూతి మరింత పెరిగి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ కే పట్టం కట్టే చాన్స్ ఉంది. ఆయన సతీమణి ఇప్పటికే విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఈ కోణంలోనూ ఆయనకు బెయిల్ రావడమే మంచిదని రాజకీయ ప్రత్యర్థులు కూడా అనుకుంటున్నారు.