అన్ స్టాపబుల్ తో బాలయ్య ఇమేజ్ దెబ్బకు మారిపోయింది. ఆయన ఫ్యామిలీస్‌కి మరింత దగ్గరైపోయాడు. బాలయ్య అంటే పడనివాళ్లుంటే… వాళ్లు కూడా ఆయనకు అభిమానులుగా మారిపోయారు. ఇప్పుడు అన్‌స్టాపబుల్ 2 సీజన్‌కు ముహూర్తం కుదిరింది. అతి త్వరలోనే ఈ సీజన్ ప్రారంభం కాబోతోంది. `దెబ్బకు థింకింగ్ మారిపోవాలా..` అనే క్యాప్షన్‌తో.. బాలయ్య మరోసారి హంగామా చేయడానికి రెడీ అయిపోయాడు.
ఫస్ట్ సీజన్లో ప్రతీ ఎపిసోడూ హైలెట్టే. మహేష్‌బాబు, రవితేజల ఎపిసోడ్లు అయితే.. కేక పుట్టించాయి. సీజన్ 2లోనూ మాట్లాడుకోవడానికీ, చెప్పుకోవడానికీ, చూడడానికీ చాలా విషయాలే ఉన్నాయి. ఇంకా చిరంజీవి, వెంకటేష్, నాగార్జున లాంటి స్టార్లు బాలయ్యతో ములాఖాత్ అవ్వాల్సివుంది. వీళ్లందరినీ ఈ సీజన్లో చూసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. చిరు, నాగ్, వెంకీ, బాలయ్య వీళ్లంతా సమకాలికులే. దాదాపు ఒకేసారి స్టార్ డమ్ చవి చూశారు. చిత్రసీమకు మూలస్థంభాలుగా నిలిచారు. వీళ్లందరినీ బాలయ్య షోలో చూడడం నిజంగానే ఓ గొప్ప అనుభూతి. సీజన్ 2ని కొత్త తరహాలో డిజైన్ చేసిందట ఆహా! కొత్త కొత్త సెగ్మెంట్లని పరిచయం చేయబోతోందట. తొలి ఎపిసోడ్‌ని ఎవరితో చేయాలి అనేది కూడా ఫిక్సయిపోయిది. ఆ ఎపిసోడ్ తో ఘనంగా సీజన్ 2కు తెర తీయాలని చూస్తోంది. ఆ స్టార్ ఎవరన్నది నాలుగైదు రోజుల్లో తేలిపోతుంది.