ప్రస్తుతం తెలుగు చిత్రసీమకు రెండు ప్రధాన కళ్లు… తిరుగులేని స్టార్లు, సెంచరీ దాటిన హీరోలు… చిరంజీవి, నందమూరి బాలకృష్ణ. వీళ్లిద్దరూ ఇప్పుడు ఒకే వేదికపై కనిపిస్తే సినీ అభిమానులకు అది పండగే. ఆ పండగవాతావరణాన్ని తీసుకురావాలని ప్రయత్నిస్తోంది `జయ జానకి నాయక` టీమ్. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీసు దగ్గర వసూళ్లు భారీగానే అందుకొంటోంది. `జయ జానకి నాయక` థ్యాంక్స్ మీట్‌ని హంసలదీవిలో జరపాలని చిత్రబృందం నిర్ణయించుకొంది. హంసలదీవినే ఎందుకంటే… అక్కడ ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్‌ని తెరకెక్కించారు. దానికి మంచి స్పందన వస్తోంది. పైగా ఏపీ ఆడియన్స్‌ని కలిసినట్టు ఉంటుంది. తెలంగాణ వరకూ హైదరాబాద్ లో మరో సక్సెస్ మీట్‌ని ఏర్పాటు చేస్తారట. ఈ కార్యక్రమానికి చిరంజీవి, బాలయ్యలను పిలిస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచనలో ఉంది చిత్రబృందం. బోయపాటికీ బాలయ్యకు ఉన్న రిలేషన్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిరు 152వ చిత్రానికి బోయపాటినే దర్శకుడు. సో… బోయపాటి అడిగితే.. వాళ్లు నో చెప్పరు. సో.. చిరు, బాలయ్య బోయపాటి కోసం తరలిరావడం ఖాయమైపోయినట్టే.