ఈమధ్య బడా హీరో సినిమా అంటే… కథ కంటే ఎలివేషన్లమీదే ఫోకస్ పడిపోతోంది. ముఖ్యంగా యాక్షన్ ఘట్టాల్ని ఓ రేంజ్ లో ఊహించుకుంటున్నారు అభిమానులు. `అఖండ`లో ఎలివేషన్లు,యాక్షన్ ఎపిసోడ్లు బాగా కుదిరాయి. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంలో దోహదం చేశాయి. ఇప్పుడు బాలయ్య మరో యాక్షన్ సినిమా చేస్తున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకుడు. ఇందులోనూ ఫైట్లకు పెద్ద పీట వేశారు. ముఖ్యంగా నాలుగు ఫైట్లు అదిరిపోయే స్థాయిలో ఉంటాయని టాక్.
సినిమా మొదలైన 20 నిమిషాలకు తొలి ఫైట్ వస్తుంది. ఆ ఫైట్‌ని నరసింహస్వామి గుళ్లో తెరకెక్కించారు. అందుకోసం హైదరాబాద్ శివార్లలో ఓ సెట్ వేశారు. ఈ సెట్లోనే తొలి ఫైట్‌ని రామ్ లక్ష్మణ్ మాస్టర్లు తీర్చిదిద్దారు. ఈ ఫైట్.. సూపర్ మాసీగా, స్టైలీష్‌గా ఉండబోతోందని టాక్. కథ ప్రకారం వచ్చే తొలి పోరాట ఘట్టం కాబట్టి చిత్రబృందం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ ఫైట్ కంపోజ్ చేసింది. ఈ సినిమాలోని మేజర్ హైలెట్స్‌లో ఈ ఫైట్ ఒకటి కాబోతోందని టాక్. గోపీచంద్ మలినేని `క్రాక్`లో కూడా కొన్ని ఫైట్లు గుర్తిండిపోయేలా మలిచారు. ఈసారీ… వాటిపై గట్టిగానే ఫోకస్ పెట్టాడు.