ఇండ్రస్ట్రీలో ఉన్న ప్రతి అగ్ర హీరోతోనూ ఓ సినిమా చేయాలని ఫిక్సయ్యాడు కొరటాల శివ. ఇప్పటికే మహేష్‌బాబు, ఎన్టీఆర్, ప్రభాస్‌తో సినిమాలు చేసేశాడు. ఇప్పుడు చిరంజీవితో కూడా సినిమా పూర్తయ్యింది. త్వరలోనే బాలకృష్ణతో ఓ సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం. బాలయ్య మాత్రమే చేయదగిన కథ.. కొరటాల దగ్గర రెడీగా ఉంది. దాన్ని బాలయ్యతోనే పట్టాలెక్కించాలని చూస్తున్నాడు. కొరటాల అడిగితే.. ఏ హీరో కూడా `నో` చెప్పడు. బాలయ్య అస్సలు చెప్పడు. సో.. ఈ కాంబో దాదాపుగా ఖాయం.కాకపోతే.. అటు బాలయ్యకు, ఇటు కొరటాలకూ వరుసకమిట్మెంట్స్ ఉన్నాయి. అవన్నీ అయి,.. ఇద్దరూ ఒకే టైమ్ లో ఖాళీ అవ్వాలి. అప్పుడే ఈ ప్రాజెక్ట్ సెట్ అవుతుంది. ఇటీవల ఓ అగ్ర నిర్మాత కొరటాలని కలిసి `నాకో సినిమా చేసి పెట్టు` అని అడిగినప్పుడు బాలయ్య కథకు సంబంధించిన ప్రస్తావన వచ్చిందని సమాచారం. సో… ఈ కాంబోకి తలుపులు తెరచుకున్నట్టే.