బాలకృష్ణ ప్రస్తుతం వీరసింహారెడ్డి, ‘అన్స్టాపబుల్ సీజన్2’ షూటింగ్ లతో బిజీగా ఉన్నారు. ఇందులో గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న వీరసింహ దాదాపు పూర్తయింది. అటు అనిల్ రావిపూడితో బాలకృష్ణ ఒక మాస్ ఎంటర్టైనర్కు సంతకం చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. ఈ సినిమా షూటింగ్ కు రెడీ అయ్యింది. రేపటి నుండి షూటింగ్ మొదలుపెడతారు. స్పెషల్ గా డిజైన్ చేసిన సెట్ లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ తో షూటింగ్ స్టార్ట్ చేస్తారని తెలిసింది.
ఈ సినిమాకు నేపథ్య సంగీతం తమన్ అందిస్తున్నారట. బాలకృష్ణను ఇప్పటి వరకు చూడని లుక్లో చూపిస్తానని గతంలోనే అనిల్ రావిపూడి చెప్పిన సంగతి తెలిసిందే. ఫస్ట్ షెడ్యుల్ తర్వాత బాలకృష్ణ లుక్కు సంబంధించిన పోస్టర్ విడుదల చేసే అవకాశం ఉంది. ఈ ప్రాజక్టును సాహూ గారాపాటి ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. 2023 వేసవికి ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.