నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కలయికలో కొత్త సినిమా మొనన్నే ప్రారంభమైయింది. మొదటి షెడ్యుల్ షూట్ చేస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ పాత్ర పేరు ‘వీరసింహారెడ్డి’అని తెలిసింది. దాదాపు ఈ పేరే టైటిల్ గా ఖారారు కావచ్చు. ‘రెడ్డి’ టైటిల్ తో బాలయ్యకు హిట్ సెంటిమెంట్ వుంది. బాలకృష్ణ కెరీర్లో మైలురాయి లాంటి సినిమా ‘సమరసింహారెడ్డి’. ఈ సినిమాతో ఫ్యాక్షన్ కథలకు కొత్త మెరుపు వచ్చింది. అలాగే ‘సింహా’ కూడా బాలయ్యకు బాగా కలిసొచ్చిన టైటిల్. ఈ రకంగా చూసుకున్నా ‘వీరసింహా రెడ్డి’ టైటిలే ఫిక్స్ చేసే అవకాశం వుంది.
అన్నట్టు.. ఈ సినిమా ఓ తమిళ సినిమాకి రీమేక్ అని ప్రచారం జరుగుతుంది. ఓ తమిళ సినిమా హక్కులు తీసుకొని దర్శకుడు లైన్ ని డెవలప్ చేశారని ప్రచారం. కానీ ఇందులో వాస్తవం లేదు. గోపీచంద్ మలినేని ఒరిజినల్ కథతో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళారు. శ్రుతి హాసన్ ఇందులో హీరోయిన్ గా కనిపించే అవకాశం వుంది. వరలక్ష్మీ శరత్ కుమార్ ని ఓ కీలక పాత్ర కోసం ఎంపిక చేశారు. కన్నడ నటుడు దునియా విజయ్ ఇందులో విలన్ రోల్ చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణం.