జై సింహా టీజర్ అభిమానుల్ని ఆకట్టుకొంది. బాలయ్యని వాళ్లు ఎలా చూడాలనుకుంటున్నారో దాన్ని అలానే కట్ చేశారు. ట్రైలర్ కూడా రెడీ అయిపోయింది. ఆదివారం పాటలతో సహా… ట్రైలర్‌ని విడుదల చేయనున్నారు. ట్రైలర్ కూడా.. యాక్షన్ ప్యాకేజ్డ్తో ఉందట. సింహా, లెజెండ్‌లో ఎంత యాక్షన్ ఉందో.. అంతా ఈ సినిమాలో ఉందని, దానికి తగ్గట్టుగానే ట్రైలర్ కట్ చేశారని టాక్.అయితే.. యాక్షన్ పార్ట్ ఫస్ట్ ఆఫ్‌కీ, క్లైమాక్స్కీ మాత్రమే పరిమితం అని తెలుస్తోంది. సెకండాఫ్ మొత్తం సెంటిమెంట్ దట్టించార్ట. బాలకృష్ణ – నయనతార ఎపిసోడ్లన్నీ సెంటిమెంట్ సీన్లే అని తెలుస్తోంది. ద్వితీయార్థం ప్రారంభం నుంచీ దాదాపు క్లైమాక్స్ వరకూ జై సింహా కథంతా సెంటిమెంట్ చుట్టూనే నడుస్తుందని, ఆ సీన్లు ఎంత ఎలివేట్ అయితే.. అంతగా ఈ సినిమా ఆడుతుందనేది ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. సంక్రాంతి బేసిగ్గా..ఫ్యామిలీ ఆడియన్స్‌ని టార్గెట్ చేసే సీజన్. కుటుంబాలన్నీ థియేటర్‌కి తరలి వస్తుంటాయి. వాళ్లని దృష్టిలో ఉంచుకుని చూసినా.. జై సింహా సెంటిమెంట్ వర్కవుట్ అయిపోయేలానేఉంది. అయితే… ఆ డోసు మరీ ఎక్కువైతే మాత్రం మొదటికే మోసం వస్తుంది. ఈ విషయంలో కె.ఎస్.రవికుమార్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకొన్నాడో మరి. అజ్ఞాత వాసితో పోలిస్తే.. జై సింహాకి హైప్ లేదన్నది వాస్తవం. లో ప్రొఫైల్‌తో విడుదల కావడం కూడా తమకు కలిసొస్తుందని ఈ టీమ్ భావిస్తోంది. మరి ఈ సెంటిమెంట్లు ఎంత వరకూ వర్కవుట్ అవుతాయో చూడాలి.