సింహా, లెజెండ్… దర్శకుడిగా బోయపాటి స్టామినాని చూపించిన సినిమాలివి. బాలయ్య కెరీర్లోనే అతిపెద్ద కమర్షియల్ హిట్స్ గా నిలిచాయి. బాలయ్యని సరికొత్త కోణంలో చూపించిన సినిమాలివి. ఇందులో బాలయ్య గెటప్, డైలాగ్ డెలివరీ… రెండూ విభిన్నంగా ఉంటాయి. ఈమధ్య కాలంలో బాలయ్యని ఇంత పవర్‌ఫుల్‌గా చూపించింది బోయపాటి శ్రీనునే అనేది అభిమానుల మాట. అది నిజం కూడా. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో ముచ్చటగా మూడో సినిమా రాబోతోంది. ఏప్రిల్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది.
ఈసారి కూడా బోయపాటిశ్రీను.. సింహా స్టైల్‌నే ఫాలో అవుతున్నాడని ఇన్సైడ్ వర్గాల టాక్. సింహాలో బాలయ్య రెండు పాత్రల్లో కనిపిస్తాడు. ఓ పాత్ర రాయల్‌గా ఉంటుంది. మరో పాత్ర మాసీగా సాగుతుంది. ఈసారి కూడా బాలయ్య పాత్రలో ఈ రెండు కోణాలూ ఉంటాయని తెలుస్తోంది. నిజానికి బాలయ్యతో ఓ పొలిటికల్ సినిమా తీయాలన్నది బోయపాటి ఆలోచన. దానికి సంబంధించిన కథ కూడా సిద్ధమైపోయింది. 2019 ఎన్నికలకు ముందు.. ఈ సినిమా తీసుకురావాలనుకున్నారు. కానీ… ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎన్నికల ముందు ఈ సినిమాని విడుదల చేయడం సాధ్యం కాదు. ఎన్నికలు అయ్యాక,.. ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలీదు. అందుకే అసలు పొలిటికల్ టచ్ లేని సినిమా చేయాలని ఫిక్సయ్యారు. దాని కోసం కథని కూడా మార్చాడని తెలుస్తోంది. ముందు అనుకున్న కథని పక్కన పెట్టి.. బోయపాటి చెప్పిన లేటెస్ట్ వెర్షన్‌ని బాలయ్య ఓకే చేశాడట. మొత్తానికి మనమంతా సింహా 2ని చూడబోతున్నామన్నమాట.