బాలకృష్ణ – బాబి కాంబినేషన్లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ చక చక సాగుతోంది. హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా కోసం ఓ భారీ సెట్ తీర్చిదిద్దారు. అక్కడే ఈ నెలాఖరు వరకూ కీలక సన్నివేశాలతో పాటు, ఓ యాక్షన్ ఘట్టాన్నీ తెరకెక్కించనున్నారు. దాదాపు 30 శాతం షూటింగ్ పూర్తయ్యింది. ఈ దసరాకి ఈ చిత్రాన్ని విడుదల చేయాలన్నది ప్లాన్. అయితే మధ్యలో బాలయ్య రాజకీయాలతో బిజీ అవ్వబోతున్నాడు. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో… మార్చి నుంచి షూటింగులకు బాలయ్య అందుబాటులో లేకపోవొచ్చు. ఈలోగా బాలయ్య లేని సన్నివేశాల్ని పూర్తి చేసేందుకు చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అన్నీ అనుకొన్నట్టు జరిగితే… ఈ దసరాకే ఈ సినిమా విడుదల కావొచ్చు. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే సన్నివేశాల్లో దుల్కర్ కనిపించనున్నాడు. ప్రస్తుతం దుల్కర్ బిజీగా ఉన్నాడు. తన డేట్లు సర్దుబాటు అయితే బాలయ్యతో ఉన్న కాంబినేషన్లు పూర్తి చేయాలని చిత్రబృందం ఎదురు చూస్తోంది