సింహా, లెజెండ్, అఖండ.. బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్లో వచ్చిన సినిమాలివి. ఈ మూడు సినిమాలూ సూపర్ హిట్టే. ఒకదాన్ని మించి మరోటి విజయాన్ని అందుకొన్నాయి. ఈ మూడు సినిమాల్లో కామన్ గా కనిపించే పాయింట్ ఏమిటంటే… ఇందులో బాలయ్య రెండు రకాల గెటప్పులు, రెండు పాత్రల్లో కనిపిస్తాడు. ఓ పాత్ర కాస్త క్లాస్ గా ఉంటే, ఇంకో పాత్ర పూర్తిగా వైల్డ్ గా ఉంటుంది. అది బోయపాటి సక్సెస్ ఫార్ములా.
ఇప్పుడు రామ్ తో ఓ సినిమా చేస్తున్నాడు బోయపాటి. ఇందులోనూ సేమ్ ఫార్ములా. ఇందులో ఇద్దరు రామ్ లు ఉంటారు. ఇద్దరివీ వేర్వురు గెటప్పులు. ఒకటి క్లాస్ అయితే.. రెండోది వైల్డ్. ఆ రెండో పాత్రని ప్రవేశ పెట్టే సమయం, సందర్భం.. గూజ్బమ్స్ తెప్పించేలా ఉంటాయని, రెండో గెటప్పులో.. రామ్ విశ్వరూపం చూపించబోతున్నాడని, తనది ఇది నెవర్ బిఫోర్ అవతార్ అని ఇన్ సైడ్ వర్గాల టాక్. ఈ సినిమా టైటిల్ కూడా ఇంకా ప్రకటించలేదు. లెజెండ్, అఖండలా.. మూడు అక్షరాల పవర్ఫుల్ టైటిల్ కోసంచిత్రబృందం అన్వేషిస్తోంది. త్వరలోనే ఓ మంచి ముహూర్తం చూసుకొని టైటిల్ ని అధికారికంగా ప్రకటిస్తారు.