ఎన్టీఆర్ బయోపిక్ కు అన్ని ఏరియాల నుంచి సినిమాకు పాజిటివ్‌గా స్పందన రావడంతో చిత్ర బృందం విజయోత్సాహంతో ఉంది. ఈ సినిమా సక్సెస్‌లో సింహభాగం దర్శకుడు క్రిష్‌దేనని బాలకృష్ట చెబుతున్నారట. దీంతో ఆయనకు అదనంగా ఐదుకోట్ల పారితోషికాన్ని అందివ్వాలని బాలకృష్ణ నిశ్చయించున్నారని తెలిసింది. ముందుగా రెండు భాగాలకు కలిపి క్రిష్‌కు పదికోట్ల రెమ్యునరేషన్ ఆఫర్ చేశారు. ఈ సినిమా చిత్రీకరణలో క్రిష్ చూపించిన అంకితభావం, ప్రణాళిబద్దమైన పనితీరు బాలయ్యను ఎంతగానో ఆకట్టకుందట. కేవలం మూడునెలల వ్యవధిలో రెండు భాగాల షూటింగ్‌ను పూర్తిచేశారు క్రిష్. సంక్రాంతి బరిలో ఈ సినిమా సంతృప్తికరరమైన ఫలితాల్ని సాధిస్తుండటంతో రెండో భాగం సక్సెస్‌పై ధీమాగా ఉన్నారు. ఈ విషయాలన్నింటిని పరిగణనలోకి తీసుకున్న బాలకృష్ణ రెండో భాగం విడుదలకు ముందే క్రిష్‌కు బోనస్‌గా ఐదుకోట్ల రెమ్యునరేషన్‌ను అందించబోతున్నారని ఫిల్మ్‌నగర్‌లో వర్గాల్లో టాక్ వినిపిస్తున్నది.