నందమూరి బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. అయితే ఈ సినిమా టైటిల్ ఇంకా ఫిక్స్కాలేదు. `నరసింహారెడ్డి`, `అన్నగారు` పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఖాయం చేయాల్సివుంది. అయితే ఆ బాధ్యత బాలయ్యకే అప్పగించాడు దర్శకుడు. `నాకు ఈ రెండు టైటిళ్లూ నచ్చాయి. మీరే ఏదో ఒకటి ఖాయం చేయండి` అని బాల్… బాలయ్య కోర్టులో విసిరేశాడు దర్శకుడు. దాంతో బాలయ్య `అన్నగారు` టైటిల్‌కే ఓటే వేసినట్టు టాక్.
నరసింహారెడ్డి.. టైటిల్ కూడా బాలయ్యకు బాగా నచ్చిందట. అందులో సింహా.. సెంటిమెంట్ కూడా ఉంది. బాలయ్య సూపర్ హిట్ సినిమాలైన సమర సింహారెడ్డి, నరసింహానాయుడు, సింహా టైటిళ్లు మూడూ కలిసి… `నరసింహారెడ్డి` టైటిల్ ఫిక్స్ చేశారు. అయితే టైటిల్ బాగానే ఉన్నప్పటికీ.. పాత వాసన కొడుతోందని `రెడ్డి` అనగానే నార్మల్ ఫ్యాక్షనిస్ట్ సినిమా అని ప్రేక్షకులు భావించే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో.. చివరకు `అన్నగారు` టైటిల్ వైపే బాలయ్య మొగ్గు చూపించాడని టాక్. జూన్ 10న బాలయ్య పుట్టిన రోజు. ఈ సందర్భంగా.. టైటిల్ ఖాయం చేసే అవకాశం ఉంది.