నందమూరి బాలకృష్ణ ఎక్కడ ఉంటే అక్కడ హడావుడి కనిపిస్తుంది. హుద్ హుద్ సమయంలో బాలయ్య పాడిన పాట, టాలీవుడ్ డైమండ్ జూబ్లీ కార్యక్రమంలో బాలయ్య వేసిన స్టెప్పులు అభిమానులకు గుర్తుండే ఉంటాయి. చిరు ఇంట జరిగిన పెళ్లిలో బాలయ్య వేసిన స్టెప్పుల గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉంటారు. పైకి గంభీరంగా కనిపించే బాలయ్యలో అల్లరి బుల్లోడు అప్పుడప్పుడూ ఇలా హంగామా చేయడం అభిమానులకూ నచ్చుతుంటుంది. తాజాగా సైమా లో బాలయ్యే సెంట్రాఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. శుక్రవారం, శనివారం దుబాయ్‌లో సైమా అవార్డు కార్యక్రమం జరిగింది. ఉత్తమ నటుడిగా బాలయ్య (గౌతమి పుత్ర శాతకర్ఱి)కి అవార్డు అందుకున్నాడు. శనివారం రాత్రి అవార్డు కార్యక్రమం ముగిసిన వెంటనే దుబాయ్‌లో మిడ్ నైట్ పార్టీ జరిగింది. ఈ పార్టీలో దక్షిణాది నుంచి వచ్చిన సెలబ్రెటీలంతా పాల్గొన్నారు. రాత్రి 1 గంటలకు మొదలై 5 గంటల వరకూ ఈ పార్టీ జరుగుతూనే ఉంది. పార్టీ మొత్తానికి బాలయ్యే సెంట్రాఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. రాత్రంతా… డాన్సులు చేస్తూ.. అక్కడి వాళ్లని ఉత్సాహపరిచారు. బాలయ్య చుట్టూ మిగిలిన హీరోయిన్లు, హీరోలూ చేరి… స్టెప్పులేశారు. అంజలి, ప్రగ్యా జైస్వాల్, శ్రియ వీళ్లంతా బాలయ్య అల్లరిలో పాలు పంచుకున్నారు. అర్థరాత్రి దాటినా ఏమాత్రం తగ్గని బాలయ్య ఎనర్జీ చూసి.. అక్కడి వాళ్లంతా ముక్కున వేలేసుకున్నారు. బాలయ్య అంటే అంతే కదా మరి!!