కష్టం వచ్చినప్పుడు అండగా ఉండేదే కుటుంబం. కుటుంబం అన్నాక.. అన్నీ సవ్యంగా ఉండవు. కోపాలుంటాయి.. తాపాయింటాయి, ఇగో ప్రాబ్లమ్స్ ఉంటాయి. నందమూరి కుటుంబం ఇవి ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే.. సినీ, రాజకీయరంగాల్లో ఆ కుటుంబం చాలా పవర్ ఫుల్. ఒకరికి ప్రాధాన్యం దక్కలేదని మరొకరు.. తనకు ప్రాధాన్యం దక్కడం లేదని మరొకరు… ఇలా ఫీలయ్యేవాళ్లూ ఉంటారు. కానీ అవన్నీ అంతర్గతమే. ఈ విషయాన్ని మరోసారి నిరూపించింది నందమూరి కుటుంబం. హరికృష్ణ హఠాన్మరణంతో.. నందమూరి కుటుంబం అంతా ఏకతాటిపైకి వచ్చింది. అన్న కుమారులుకు ధైర్యం చెప్పారు. అన్నీ పనులూ దగ్గరుండి చేసుకున్నారు. వారికి ఏ లోటు లేకుండా చేసుకున్నారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల పాటు హరికృష్ణ కుటుంబంతో పాటే ఉన్నారు. హరికృష్ణ సోదరుడు బాలకృష్ణ కూడా అంతే. బాలకృష్ణకు హరికృష్ణ సోదరులకు మధ్య మాటల్లేవని ఈ మధ్య కాలంలో విస్తృతంగా ప్రచారం జరిగింది. దానికి తగ్గట్లుగా సినిమా ఫంక్షన్లు కానీ.. రాజకీయ వేడుకల్లో కానీ… ఒకరికొకరు ఎదురుపడిన సందర్భం లేదు. ఆ రూమర్స్ అలానే ఉండిపోయాయి. వాటిలో ఎంత వరకూ నిజం ఉందో కానీ… ఇప్పుడు మాత్రం అవన్నీ దూది పింజ్లా తేలిపోయాయి. అబ్బాయిలతో బాబాయ్ … అన్నిఅంశాలు చర్చిస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది.
అనుకోకుండా వచ్చిన ఓ పెద్ద కష్టం మళ్లీ నందమూరి కుటుంబాన్ని ఏకం చేసినట్లే చెప్పుకోవాలి. ఇక కుటుంబ పెద్దగా.. అబ్బాయిలకు అండగా ఉంటాని.. మాటల్లో కాకుండా.. చేతల్లోనే చూపించారు నందమూరి బాలకృష్ణ. హరికృష్ణ మరణమే నేపధ్యంగా… ఆ కుటుంబంలో ఉన్న బేధాభిప్రాయాలను… అంతకంతకూ పెంచి… రాజకీయంగా లబ్ది పొందాలని.. అప్పటికే కొంత మంది ప్రయత్నాలు చేశారు. అలాంటి కుట్రలు ఫలించవని.. బాబాయ్ – అబ్బాయిలు మనసు విప్పి మాట్లాడుకుంటూ కనిపించి… నందమూరి అభిమానులకు సందేశం పంపారు.