కాచిగూడలోని ‘తారకరామ’ థియేటర్ పునః ప్రారంభించారు నందమూరి బాలకృష్ణ. సునీల్ నారంగ్ ‘ఏషియన్ తారకరామ’ థియేటర్ని పునరుద్ధరించారు. ఈ రోజు ‘ఏషియన్ తారకరామ’ థియేటర్ పునః ప్రారంభ కార్యక్రమం బాలకృష్ణ చేతులు మీదగా జరిగింది. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ అందరికీ అందుబాటు ధరలో టికెట్ రేట్లు వుండటం ఇండస్ట్రీకి ఆరోగ్యకరమని అన్నారు.
”ఇప్పుడు ఎంతమంది, ఎన్నిసార్లు థియేటర్ కి వచ్చి సినిమా చుస్తారనేది ఒక ప్రశ్న. ఓటీటీ రూపంలో సినిమా ఇండస్ట్రీకి ఒక కాంపిటేషన్ వుంది. అందరం కలసి మంచి సినిమాలని అందించాలి. టికెట్ రేట్లు కూడా అందుబాటులో వుండాలి. ప్రేక్షకులు తప్పకుండా థియేటర్స్ కి వస్తారు. థియేటర్లో పొందే ఆనందం వేరు. పాన్ ఇండియా స్థాయికి తెలుగు చిత్ర పరిశ్రమ ఎదిగింది. అదే స్ఫూర్తితో ముందుకు కొనసాగాలి” అన్నారు బాలయ్య.