నందమూరి బాలకృష్ణ ఎక్కడుంటే అక్కడ సందడి నెలకొంటుంది. మాటలతోనో, చేతలతోనో…. చుట్టూ ఉన్నవాళ్లలో ఫైర్ పుట్టిస్తాడు బాలయ్య. పక్కన హీరోయిన్లుంటే ఇక ఆయన్ని ఆపడం ఎవరి తరమూ కాదు. వాళ్లపై ఏవేవో సెటైర్లు వేస్తూ.. అల్లరి అల్లరి చేస్తుంటాడు. డిక్టేటర్ ఫంక్షన్లో అంజలి నడుము గిల్లి.. చిలిపి చేష్టల్లో తనకు తానే సాటి అని నిరూపించుకొన్న బాలయ్య.. తాజాగా త్రిషనీ వదిలిపెట్టలేదు. త్రిష కథానాయికగా నటించిన నాయకి ఆడియో ఫంక్షన్ని బాలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ ఫంక్షన్ని వచ్చీరాగానే.. త్రిషని ఆప్యాయంగా హగ్ చేసుకొన్నాడు. అక్కడితో ఆగితే బాగుణ్ణు. ముగ్గపై ముద్దల వర్షం కురిపించి, త్రిష చేతా ఓ తీయని ముద్దు ఇప్పించుకొన్నాడు. దాంతో చుట్టూ ఉన్నవాళ్లంతా అవాక్కయ్యారు. బాలయ్య ఎప్పుడూ ఇంతే కదా? ఇవాళ కొత్తేముంది అని బాలయ్య గురించి తెలిసినవాళ్లు లైట్ తీసుకొంటే.. అక్కడున్న మీడియా… ఈ ముద్దుల చిత్రాన్ని కెమెరాల్లో బంధించింది. మొత్తానికి మరోసారి బాలయ్య తన రసికతను చూపించుకొన్నాడు. అదీ.. బాలయ్యంటే.