నందమూరి బాలకృష్ణ రాజకీయాలను రాజకీయంలాగే చేస్తున్నారు. ఏ చిన్న విషయాన్ని సీరియస్ గా తీసుకోరు. హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవి వైసీపీకి దూరం చేసేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆరు వార్డుల్లో మాత్రమే టీడీపీ గెలిచింది. వైసీపీ చేసిన అరాచకాలు అప్పట్లో వైరల్ అయ్యాయి. ఇప్పుడు టీడీపీ వంతు వచ్చింది.
టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవికి ఇంద్రజ అనే వైసీపీ నేత రాజీనామా చేసి టీడీపీలో చేరిపోయారు. దాదాపుగా ఇరవై మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరిపోయారు. దీంతో టీడీపీకి పూర్తి మద్దతు లభించింది. అయితే స్థానిక రాజకీయాల కారణంగా నలుగురు కౌన్సిలర్లు మళ్లీజగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అయితే వారు అలా చేరారు కానీ టీడీపీకే మద్దతుగా ఉంటారన్న ప్రచారం జరుగుతోంది.
హిందూపురం కౌన్సిలర్లు బాలకృష్ణ క్యాంపు ఏర్పాటు చేశారు. ఆయనకు కూడా ఎక్స్ అఫిషియో ఓటు హక్కు ఉంటుంది. దీంతో ఎన్నిక ఆసక్తికరంగా మారింది. మరో వైపు గతంలో ఇంచార్జ్ గా ఉన్న మాజీమంత్రి పెద్దిరెడ్డి ఇప్పుడు పట్టించుకోవడంలేదు. కౌన్సిలర్లు డబ్బులు ఆశిస్తున్నారు. కానీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన దీపికారెడ్డి పెద్దగా పట్టించుకోవడంలేదని లేదు. వ్యతిరేకంగా పని చేస్తే పదవులు పోతాయని హెచ్చరిస్తున్నారు కానీ.. టీడీపీ అండ ఉంటే.. పదవులు ఎక్కడికి పోతాయని ఫిరాయింపు కౌన్సిలర్లు ధీమాగా ఉన్నారు.