హైదరాబాద్: నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ అయ్యారు. నందమూరి బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సేవల గురించి బాలయ్య కేసీఆర్కు వివరించారు. రోగులకు సౌకర్యాలు కల్పించటంకోసం ఆసుపత్రి ఆవరణలో నైట్ షెల్టర్ల వటి పలు నిర్మాణాలు చేపట్టామని, వాటిని బీఆర్ఎస్ కింద క్రమబద్ధీకరించాలని కోరారు. దీనికి కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. తర్వాత ఇరువురూ సినిమాల గురించి కొద్ది సేపు ముచ్చటించుకున్నారు. తన తాజా చిత్రం డిక్టేటర్ను చూడాలని బాలయ్య ముఖ్యమంత్రిని కోరారు. 100వ సినిమా ఎప్పుడు చేస్తున్నారని కేసీఆర్ అడగగా, ఆదిత్య 369 చిత్రానికి సీక్వెల్గా వస్తున్న సినిమానే తన వందో సినిమా అని బాలయ్య తెలిపారు. తన కుమారుడు మోక్షజ్ఞను వందో చిత్రం ద్వారా పరిచయం చేయబోతున్నట్లు బాలయ్య కేసీఆర్కు వెల్లడించారు.
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఇవాళ ఎన్టీఆర్ ఘాట్ వద్ద సర్వమత ప్రార్థనలు నిర్వహించటానికి ప్రభుత్వం అనుమతిని నిరాకరించింది. దీనిపై టీడీపీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ ధర్నా కూడా చేశారు. అటు ఘాట్ వద్ద నివాళులర్పించటానికి వెళ్ళిన బాలకృష్ణ కూడా దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కనీస సౌకర్యాలు లేకపోవటం సరికాదని మండిపడ్డారు. చాలా పార్టీలలోని ముఖ్య నేతలకు భిక్ష పెట్టింది ఎన్టీఆరేనన్నారు. ఎన్టీఆర్ వల్లనే కొందరు ఇవాళ మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా ఉన్నారంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ ఈ ఏర్పాట్లపైనే ముఖ్యమంత్రితో మాట్లాడటానికి వెళ్ళి ఉండొచ్చనే వాదన వినబడుతోంది. స్వతహాగా ఆవేశపరుడు కావటంతో వెంటనే కేసీఆర్ అపాయింట్మెంట్ తీసుకుని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఏర్పాట్ల గురించి మాట్లాడటానికి వెళ్ళి ఉండొచ్చు. అయితే ఆ అంశం వారిమధ్య చర్చకు వచ్చినట్లు బయటకు రాకపోవటం విశేషం. మరోవైపు, సర్వమత ప్రార్థనలకు అనుమతి నిరాకరించటంపై రేవంత్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు కూడా మండిపడ్డారు. కేసీఆర్కు రాజకీయ జన్మనిచ్చింది ఎన్టీఆరేనని అన్నారు. కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వపరంగా చేయాలంటూ రామారావు భార్య లక్ష్మీ పార్వతి కూడా కేసీఆర్కు ఇవాళ ఉదయం మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు.