బాలకృష్ణ మారారు. ఇదివరకటిలా తొందరపడటం లేదు. వందో సినిమా తర్వాత ఆయనలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. బాలయ్య కధల ఎంపిక చకచక జరిగిపోతుంటుంది. ఆయన్ని జస్ట్ ఇంప్రెస్ చేస్తే చాలు గ్రీన్ సిగ్నల్ వచ్చేస్తుందని, ఈ విషయంలో ఆయన భోళా అనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంటుంది. ఆయన తీసుకొనే నిర్ణయాలు కూడా అలానే వుంటాయి. అసలు లిస్టులో కనిపించని దర్శకులకు అవకాశాలు ఇస్తుంటారు. కధలు ఎంపిక కూడా అలానే ఉటుంది. ‘సింహా’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చేసిన పరమవీర చక్ర,అధినాయకుడు, శ్రీమన్నారాయణ… లెజెండ్ లాంటి సూపర్ హిట్ తర్వాత ‘లయిన్’ లాంటి సినిమా చేయడం చూస్తే.. బాలయ్య ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అర్ధమౌతుంది. అయితే అంత లైట్ మేనర్ లో కధలకు చకచక గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చేసే బాలయ్య ఇప్పుడు తన పంధా మార్చుకున్నట్లు కనిపిస్తుంది.
బాలయ్య 101 సినిమా కోసం చాలా మంది దర్శకులు లైన్ లో వున్నారు. ఇందులో కృష్ణారెడ్డి చెప్పిన కధ చాలా బావుందట. బాలయ్య సన్నిహితులు కూడా ఈ కధ అద్భుతంగా వుందని అభిప్రాయపడుతున్నారు. అయితే బాలయ్య నుండి మాత్రం గ్రీన్ సిగ్నల్ రావడం లేదు. ఈ విషయంలో చాలా ఆలోచిస్తున్నారట బాలయ్య. కృష్ణా రెడ్డే కాదు. మరో మూడు కధలు కూడా బాలయ్య దగ్గరికి వెళ్ళాయి. అవీ బాగానే వున్నాయట. అయితే బాలయ్య మాత్రం తృప్తి పడటం లేదు. ఇంకా మంచి కధ కోసం అన్వేషిస్తున్నారట. కధలో ఎంపికలో బాలయ్య లో కనిపిస్తున్న ఈ మార్పు చూసి ఆయన సన్నిహితులు సైతం ఆశ్చర్యపోతున్నార్ట.
ఇదే కాదు. మరో విషయంలో కూడా బాలయ్య లో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. మీడియాతో ఆయన ఇప్పుడు చాలా జోవియల్ గా వుంటున్నారు. ఇదివరకూ ఓ రికార్డర్ ఇంటర్వ్యూ తో పని కానించేసేవారు బాలయ్య. అయితే గౌతమీపుత్ర శాతకర్ణి విషయానికి వచ్చేసరికి అటు ప్రింట్, ఇటు ఎలాక్ట్రానిక్ మీడియా ఛానల్స్ అన్నిటితో సరదాగా ముచ్చటిస్తున్నారు బాలయ్య. మీడియా ప్రతినిధులతో తనదైన శైలిలో సరదా కబుర్లు పంచుకుంటూ చాలా జోవియల్ గా కనిపిస్తున్నారాయన. బాలయ్యలో కనిపిస్తున్న ఈ మార్పు చూసి మీడియా ప్రతినిధులు కూడా ఒక్కింత ఆశ్చర్యపోతున్నారు. మరి బాలయ్య వచ్చిన ఈ మార్పు ఎంతకాలం వుటుందో చూడాలి.