సింహా, లెజెండ్ తరవాత బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఓ సినిమా రాబోతోంది. ‘ఎన్టీఆర్’ బయోపిక్ అవ్వగానే ఈ సినిమా మొదలు కావాల్సింది. అయితే మధ్యలో కె.ఎస్.రవికుమార్ ప్రాజెక్టు ఓకే అయ్యింది. డిసెంబరు నుంచి షూటింగ్ మొదలుకానున్నదని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. 2020 వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. మిర్యాల రవీందర్రెడ్డి ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తారు. నిజానికి ఈ చిత్రాన్ని ఎన్బీకే సంస్థపైనే బాలయ్య తీద్దామనుకున్నారు. కానీ బాలయ్య మిర్యాల రవీందర్ రెడ్డికి అప్పగించారు. బోయపాటి మరోసారి శక్తిమంతమైన కథ తయారు చేశారని, సమాజంలోని సమస్యే ఈసారీ కథ వస్తువు అవ్వబోతుందని చిత్రబృందం తెలిపింది. త్వరలోనే ఇతర నటీనటుల, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియజేస్తారు.