కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడాన్ని టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎప్పటి నుండో సమర్థిస్తున్నారు. అయితే ఆయన డిమాండ్ ఒక్కటే హిందూపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయడం. కానీ ప్రభుత్వం మాట తప్పింది. పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి జిల్లాను ప్రకటించారు. దీంతో నందమూరి బాలకృష్ణ అసంతృప్తికి గురయ్యారు. మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గం కేంద్రంగా జిల్లాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
స్తుతం ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లలో జిల్లాల కేంద్రాలు కొన్ని మారిపోయాయి. మారిపోయిన వాటిలో బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గం కూడా ఉంది. హిందూపురం నియోజకవర్గం కేంద్రాన్ని జిల్లా చేయాలని ఎప్పట్నుంచో డిమాండ్ ఉంది. పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రం కూడా . దీంతో ప్రభుత్వం ఎప్పుడు కొత్త జిల్లాలు ప్రకటించినా హిందూపురం జిల్లా అవుతుందని అనుకున్నారు. కానీ తేడా వచ్చేసింది.
హిందూపురం పట్టణ పరిసరాల్లో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన భూమి పుష్కలంగా ఉందనన్నారు. అందుకే జిల్లాల ఏర్పాటులో రాజకీయం చేయవద్ద ..హిందూపురం ప్రజల మనోభావాలను గౌరవించి వారి చిరికాల కోరికైన హిందూపురం జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని బాలకృష్ణ కోరుతున్నారు. నెల రోజుల పాటు అభ్యంతరాలను ప్రభుత్వం స్వీకరిస్తుంది. ప్రభుత్వం స్పందించకపోతే.. బాలకృష్ణ ఉద్యమం చేస్తారేమో చూడాలి !