నందమూరి బాలకృష్ణ వందో చిత్రాన్ని మరపురాని చిత్రంగా మలిచాడు క్రిష్. ఈ విషయంలో క్రిష్‌పై బాలయ్యకు చెప్పలేనంత అభిమానం పెరిగిపోయింది. కథ చెప్పినప్పటి నుంచీ… ఈ సినిమా విడుదలై బయటకు వచ్చేంత వరకూ క్రిష్ మాటకు విలువ ఇచ్చాడు బాలయ్య. క్రిష్ ఏం చెబితే అది చేశాడు. క్రిష్ కు తగిన విధంగా మౌల్డ్ అయ్యాడు. అంతా బాగానే ఉంది. అయితే ఇప్పుడు క్రిష్‌పై బాలయ్య కాస్త కోపంగా ఉన్నట్టు తెలుస్తోంది. దానికి కారణం… గౌతమిపుత్ర శాతకర్ణి వసూళ్ల లెక్కలేవీ చిత్రబృందం అధికారికంగా విడుదల చేయకపోవడమే అని సమాచారం. బాలయ్య కెరీర్లోనే అత్యధిక వసూళ్లు అందుకొన్న చిత్రమిది. ఓవర్సీస్లో కూడా దుమ్ము దులుపుతోంది. బాలయ్య ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ చిత్రం.. అఖండ విజయం సాధించడం, వసూళ్లలో దూసుకెళ్లిపోవడం అభిమానుల్ని ఆనందంలో ముంచేదే. అయితే.. గౌతమిపుత్ర ఇంత వరకూ ఎంత వసూలు చేసిందన్న విషయాన్ని… చిత్రబృందం ప్రకటించడం లేదు. మరోవైపు ఖైదీ నెం.150 వసూళ్లు ఎప్పటికప్పుడు బయటకు వస్తున్నాయి. ఈనేపథ్యంలో గౌతమిపుత్ర వసూళ్ల గురించి కూడా లెక్కలు బయటకు చెప్పమని బాలయ్య చిత్రబృందంపై ఒత్తిడి పెంచాడట. అయితే.. టీమ్ మాత్రం సరైన సమాధానం చెప్పకపోవడం బాలయ్యకు నచ్చడం లేదని తెలుస్తోంది.
గౌతమిపుత్ర శాతకర్ణి వినోదపు పన్ను నుంచి మినహాయింపు అందుకొంది. అయితే అందుకు సంబంధించిన ఉత్తర్వులేం అధికారికంగా బయటకు రాలేదు. ఈ విషయం కోర్టు పరిధిలో ఉంది. పైగా వసూళ్ల గురించి లెక్కలు బయటకు వస్తే ఐటీ శాఖ నుంచి ప్రమాదం పొంచి ఉంటదని భయం నిర్మాతల్లో ఉంది. అందుకే వసూళ్ల లెక్కలేం చెప్పకుండా ఆ సంగతిని దాటవేస్తూ వచ్చింది చిత్రబృందం. తాజాగా శాతకర్ణి సినిమా ఆర్థిక లావాదేవీలతో సంబంధం ఉన్నవాళ్లందరి మీదా ఐటీ దాడులు జరిగాయి. ఇంత జాగ్రత్త తీసుకొన్నా.. ఐటీ వాళ్లనుంచి తప్పించుకోలేకపోయింది . అందుకే ఇప్పుడు అధికారికంగా ఆ వసూళ్ల వివరాలు చెప్పేయాలని క్రిష్ భావించాడట. చిత్రబృందం. గౌతమిపుత్ర శాతకర్ణి సక్సెస్ మీట్ ఇంకా జరగలేదు. ఆ వేడుకలో రూపాయలు పైసలతో సహా.. అన్ని విషయాలూ క్లియర్‌గా చెబుతానని క్రిష్ బాలయ్యకు మాట ఇచ్చినట్టు తెలుస్తోంది. సో.. గౌతమి వసూళ్లపై ఆ రోజే ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.