మరి కొద్ది గంటల్లో రెండు భారీ సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీసు వద్ద సత్తా చాటడానికి వస్తున్నాయి. చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’, బాలకృష్ణ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. చిరంజీవి ఖైదీ నెం.150, బాలకృష్ణ గౌతమి పుత్ర శాతకర్ఱి.. రెండూ ప్రతిష్టాత్మక చిత్రాలే. చిరు 150వ సినిమా, అలాగే ఆయన రీఎంట్రీ సినిమా. బాలయ్యకు ఇది సెంచరీ. ఒక రోజు గ్యాప్ లో అంటే బాలయ్య 12న వస్తుంటే, రేపే (11) చిరు థియేటర్ లోకి వచ్చేస్తున్నారు. చిరంజీవి బాలకృష్ణ సినిమాలు అంటే ఎప్పుడూ ఆసక్తికరమైన పోటినే. నామమాత్రానికే తమ మధ్య ఎలాంటి పోటీలు వుండవని చెబుతుంటారు. ఈ రెండు సినిమాల విషయంలో కూడా అదే జరిగింది. బాలయ్య-చిరులు ఆల్ ది బెస్ట్ చెప్పుకున్నారు. మొన్న మెగా ఈవెంట్ లో చిరంజీవి, బాలయ్య కి అల్ ది బెస్ట్ చెబితే.. తర్వాత రోజే ఓ ప్రమోషన్ ఈవెంట్ లో మాట్లాడిన బాలయ్య,.. చిరు సినిమాకి బెస్ట్ అఫ్ లక్ చెప్పారు.
అయితే ఇవి నామమాత్రపు మాటలేనని, పోటి అనేది ఖచ్చితంగా ఉటుందని తేలిపోయింది తాజగా బాలకృష్ణ చేసిన కామెంట్స్ వింటే. కొద్దిసేపటి క్రితం ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో.. రెండు భారీ సినిమాలు వస్తున్నాయి -పోటి వుండదా? అనే ప్రశ్నకు బదులిస్తూ.. ”పోటి వుంటే తప్పేంటి, ఇవి వేరు వేరు జోనర్ చిత్రాలు, ఆరోగ్యరమైన పోటీ వుండాల్సిందే, అయినా పోటి లేకుండా వచ్చి హిట్ కొడితే ఆనందం ఏముంది?’ అని కుండబద్దలు కొట్టేశారు బాలకృష్ణ.
సంక్రాంతి బరిలో రెండు పెద్ద సినిమాలు నిలిస్తున్నాయంటే ఖచ్చితంగా పోటి అనేది అనివార్యం. మాట వరుసకు మాత్రమే ఒకరికి ఒకరు అల్ ది బెస్ట్ లు చెప్పుకుంటారు. కానీ ఇరు వర్గాల పోటీతత్త్వం మాత్రం తీవ్రంగా వుటుంది. ఇప్పుడు బాలకృష్ణ కామెంట్స్ తో ఇది మరోసారి రుజువైయింది.