ఎన్టీఆర్ బయోపిక్ కు ముగ్గురు నిర్మాతలు. అయితే బ్యానర్ మాత్రం హీరో బాలయ్య కొత్తగా స్టార్ట్ చేసినదే. మిగిలిన ఇద్దరు నిర్మాతలు, సాయి కొర్రపాటి, విష్ణు ఇద్దరూ సహనిర్మాతలుగా వ్యవహారిస్తారు. అయితే అసలు ఎవరి వాటా ఎంత? ఇనీషియల్ గా ఎంత పెట్టుబడి పెడుతున్నారు అన్నది కాస్త ఆసక్తికరమే.
సినిమా నిర్మాణ వ్యయం తాత్కాలికంగా యాభై కోట్లుగా డిసైడ్ చేసారు. ఇందులో సగం మొత్తం బాలయ్య పెట్టుబడిగా పెడతారు. సినిమా లాభ నష్టాల్లో ఆయన వాటా సగం అన్నమాట. మిగిలిన ఇద్దరు నిర్మాతలు, చెరో పావలావాటా పెడతారు. అంటే చెరో 12.5 కోట్లు అన్నమాట.
ముందుగా ముగ్గురు కలిసి 12 కోట్ల వరకు పూల్ చేసి వర్క్ బిగిన్ చేసారు. తరువాత తరువాత మిగిలినది ఇన్వెస్ట్ చేస్తారు. నిర్మాణ వ్యయం యాభై కోట్లు దాటితే కనుక మళ్లీ ముగ్గురూ పైన అనుకున్న రేషియోలో భరిస్తారు. సంక్రాంతి విడుదల లక్ష్యంగా బయోపిక్ ను చకచకా రెడీ చేస్తున్నారు. దర్శకుడు క్రిష్ నే మొత్తం సినిమా వ్యవహారాలను తన భుజాలపై వేసుకుని చకచకా పని కానిస్తున్నారు.