నటసింహం బాలకృష్ణనీ, యంగ్ టైగర్ ఎన్టీఆర్నీ ఇష్టపడే అభిమానులకు `118` ప్రీ రిలీజ్ ఫంక్షన్లో బాలకృష్ణ మాట్లాడిన రెండు ముక్కలు అమితానందాన్ని కలిగిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. ఫంక్షన్లో బాబాయ్ అబ్బాయ్ మాట్లాడుకున్నప్పటికీ అభిమానుల్లో ఏదో వెలితి. దాన్ని చివర్లో బాలయ్య పటాపంచలు చేశాడు.
సినిమాల్లో మన కుటుంబం నుంచి అన్నదమ్ములు కళ్యాణ్ రామ్, తారక్ కాంట్రిబ్యూషన్ మున్ముందూ ఇలాగే కొనసాగాలని బాలయ్య అన్నారు. `తారక్… మన కుటుంబం` అనడంతో నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేవు. బాబాయ్ అబ్బాయ్ మధ్య సత్సంబంధాలు లేవనీ, అంటీముట్టన్నట్టు వుంటున్నారని విమర్శిస్తున్న వ్యక్తులకు బాలయ్య నోట వచ్చిన మాటలు చెంపపెట్టు అనుకోవాలి. తారక్ కూడా ఒకటికి రెండుసార్లు స్పీచులో మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన బాబాయ్ బాలకృష్ణకి కృతజ్ఞతలు తెలిపాడు.