పెళ్లి సందడి.. ఈ ఒకే ఒక్క సినిమాతో శ్రీలీల స్టార్ హీరోయిన్ స్టేజీకి వెళ్లిపోయింది. తన చేతి నిండా సినిమాలే. పెళ్లి సందడి హిట్టవ్వడంతో.. తన పారితోషికానికి రెక్కలొచ్చాయి. తన రెండో సినిమాకే రూ.50 లక్షలు తీసుకున్న శ్రీలీల.. ఇప్పుడు రూ.75 లక్షల పారితోషికం డిమాండ్ చేస్తోంది. అయినా సరే, తన కాల్షీట్లు దొరకడం కష్టంగా మారింది. రవితేజ, నవీన్ పొలిశెట్టి సినిమాల్లో హీరోయిన్ గా బుక్ అయిన శ్రీలీల.. నందమూరి బాలకృష్ణ సినిమాలోనూ కనిపించబోతోందట. అయితేఇక్కడ ట్విస్టేమిటంటే.. శ్రీలీల బాలయ్య పక్కన హీరోయిన్ గా కాదు.. కూతురుగా నటించబోతోంది.
నందమూరి బాలకృష్ణ – అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకోనుంది. ఇప్పటికే స్క్రిప్టు రెడీ చేశాడు అనిల్ రావిపూడి. `ఎఫ్ 3` తరవాత… పట్టాలెక్కే సినిమా ఇదే కావొచ్చు. ఇందులో బాలయ్యకు కూతురి పాత్రకు చాలా ప్రాధాన్యం ఉందని తెలుస్తోంది. అందుకోసం శ్రీలీలని ఎంచుకున్నార్ట. నిజానికి హీరోకి చెల్లి, హీరోయిన్ కి చెల్లి.. తరహా పాత్రలు శ్రీలీలకు వచ్చాయి. కానీ వాటిని తిరస్కరించింది. ఈసారి మాత్రం బాలకృష్ణ సినిమా కాబట్టి, కూతురి పాత్రలో నటించడానికి ఓకే అనేసింది.