నందమూరి బాలకృష్ణ – అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ సినిమా దాదాపుగా ఖాయమైపోయింది. `అఖండ` తరవాత బాలయ్య చేయబోయే సినిమా ఇదే కావొచ్చు. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన మరో ఇంట్రస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది. ఇది.. సోలో సినిమా కాదని, మల్టీస్టారర్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని టాక్. కల్యాణ్ రామ్ కి ఎప్పటి నుంచో.. బాబాయ్ బాలకృష్ణతో ఓ సినిమా చేయాలని వుంది. అనిల్ రావిపూడికి దర్శకుడిగా ప్రమోట్ చేసింది కల్యాణ్ రామే. అనిల్ రావిపూడికి కూడా… కల్యాణ్ రామ్ తో మరో సినిమా చేయాలని వుంది. అందుకే ఇప్పుడు పనిలో పనిగా… బాలయ్య- కల్యాణ్ రామ్ ల కాంబో సెట్ చేసేద్దామని భావిస్తున్నాడని సమాచారం. ఎఫ్ 2 లానే.. ఇద్దరు హీరోల కథని సెట్ చేసుకుంటున్నాడట రావిపూడి. ఆ కథలో బాబాయ్ – అబ్బాయ్ లను చూపించాలనుకుంటున్నాడు. కల్యాణ్ రామ్ తో ఇటీవల అనిల్ రావిపూడి భేటీ వేశాడని, బాలయ్యతో సినిమా విషయమై చర్చించాడని టాక్. అదే నిజమైతే.. నందమూరి మల్టీస్టారర్ చూసే రోజులు ఎంతో దూరంలో లేనట్టే.