తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఎనిమిది నెలల్లో అధికారాన్ని హస్తగతం చేసుకున్న నాయకుడిగా ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు. ఆయన జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో ఈ సన్నివేశాలన్నీ ఉంటాయి. ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో నందమూరి బాలకృష్ణ ముఖ్యమంత్రిగా కనిపించనున్నారు. ఈ చిత్రంతో పాటు తదుపరి చిత్రంలోనూ బాలకృష్ణ ముఖ్యమంత్రిగా కనిపిస్తారని సమాచారం.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ ఓ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. మహా నాయకుడు చిత్రీకరణ పూర్తయిన తర్వాత ఆ చిత్రం పట్టాలు ఎక్కుతుంది. ‘సింహా’, ‘లెజెండ్’ చిత్రాల తర్వాత బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రమిది. ఆ రెండు చిత్రాల తరహాలో ఇందులోనూ బాలక్రిష్ణ కోసం బోయపాటి రెండు పాత్రలు డిజైన్ చేశారట. రెండింటిలో ఒకటి ముఖ్యమంత్రి పాత్ర అని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఫిబ్రవరి 21 లేదా 22 నుంచి ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించాలని అనుకుంటున్నారు.