”పరిశ్రమలో ఇంత మంది హీరోల్లో నేను క్లోజ్ గా ఉండేది చిరంజీవితోనే” అని నందమూరి బాలకృష్ణ ఓ సందర్భంలో చెప్పడం గుర్తుండే ఉంటుంది. అది మాట వరసకు అన్నది కాదన్న విషయం… ఇటు మెగా అభిమనులకు, అటు నందమూరి అభిమానులకు కూడా తెలుసు. వీరిద్దరి అనుబంధం.. అప్పుడప్పుడూ బయటపడుతూనే ఉంది. తాజాగా.. మరోసారి చిరంజీవిని తానిచ్చే ప్రాధాన్యం ఏమిటో తెలిసొచ్చింది. తను కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం `ఎన్టీఆర్`. ఈ సినిమాకి నిర్మాత కూడా బాలకృష్ణనే. శుక్రవారం హైదరాబాద్‌లో ఆడియో ఫంక్షన్ ఘనంగా జరిగింది. నందమూరి కుటుంబం, కృష్ణ, కృష్ణంరాజు తప్ప మిగిలిన కథానాయకులెవరూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకోలేదు. అయితే.. చిరంజీవికి మాత్రం ఆహ్వానం అందిందని సమాచారం. గురువారం చిరంజీవికి బాలయ్యనుంచి ఫోన్ వెళ్లిందని, `ఆడియో ఫంక్షన్‌కి రావాలి` అని బాలయ్య చిరంజీవిని ఆహ్వానించారని తెలుస్తోంది. అయితే ఆ సమయానికి చిరంజీవి హైదరాబాద్‌లో లేరు. `సైరా` షూటింగ్ నిమిత్తం బిజీగా ఉన్నారు. ఆ విషయమే… బాలయ్యకీ చెప్పారట. ఒకవేళ చిరు హైదరాబాద్ లోనే ఉంటే, ఈ కార్యక్రమంలో తప్పకుండా పాలుపంచుకునేవారని మెగా కాంపౌండ్ వర్గాలు సైతం చెబుతున్నాయి. చిరు కూడా వచ్చి ఉంటే.. ఈ కార్యక్రమానికి మరింత వన్నె వచ్చేదేమో.